ఏపీ సీఎం పాలనపై ఎర్రబెల్లి కితాబు టిఆర్ఎస్ నేతల అయోమయం
టిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు తన పార్టీ నేతలను కామెంట్లతో కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇంతకీ ఆయన తమ పార్టీలో ఉన్నారా లేదా అని తెలియక గులాభి నేతలు అయోమయంలో పడిపోతున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే... శుక్రవారం తిరుమలకు వచ్చిన ఎర్రబెల్లి ... శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు.తెలుగు రాష్ట్రాల్లో పాలన బాగుందని, ఇద్దరు చంద్రులు బాగా పాలిస్తున్నారని కితాబిచ్చారు.
ఇద్దరు చంద్రులు సమర్థవంతంగా పాలిస్తున్నారని, రాష్ట్రాలను అభివృద్ధి వైపు తీసుకువెళుతున్నారని కొనియాడారు. దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలు దీనిపై ఎలా స్పందించాలో తెలియడం లేదు.
ఎర్రబెల్లి తిరుపతికి వెళ్లారు కాబట్టి అలా మాట్లాడారా... లేక టిఆర్ ఎస్ లో తనను ఎవరు గుర్తించడం లేదని మళ్లీ పాతగూటికి చేరే ఆలోచనలో అలా అన్నారా అనేది తెలియక సతమతమవుతున్నారు.
