ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేక లావణ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది లావణ్య. ఫీజుల కోసం యాజమాన్యం వేధించిందని ఆవేదన వ్యక్తం చేసింది

హైదరాబాద్ ఘట్‌కేసర్ జోడుమెట్లలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేక లావణ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది లావణ్య. ఫీజుల కోసం యాజమాన్యం వేధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. నా వల్ల కావడం లేదని.. చదువు కోసం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదని లావణ్య సెల్ఫీ వీడియోలో వాపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు యాజమాన్యం తీరుపై కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred