టీఆర్ఎస్ కార్పొరేటర్ అతని సోదరులు దాడి చేయడంతో మనస్తాపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ : బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని మామిడి పల్లికి చెందిన ఈరంకి శరత్ వంశీగౌడ్ అనే Engineering student బుధవారం అర్థరాత్రి Suicide చేసుకున్నాడు. TRS Corporatorఅతని సోదరుడు దాడి చేయడంతో.. ఆ అవమానం భరించలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తండ్రి నరసింహ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ... ‘నేను మామిడిపల్లిలో నీటి ట్యాంకర్ల వ్యాపారం చేస్తుంటా. నెల రోజుల కిందట ఓ రాత్రి బోర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. అక్కడికి వెళ్లి ఫోన్ లో లైట్ తో దాన్ని పరిశీలించా. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, చదును చేస్తున్న స్థానిక టిఆర్ఎస్ కార్పోరేటర్ శివకుమార్ అతని సోదరుడు శ్రీకాంత్ నా వద్దకు వచ్చి ‘వీడియో తీస్తున్నావా’ అంటూ దాడికి ప్రయత్నం చేశారు.
విషయం నా కుమారుడు శరత్ వంశీ గౌడ్ కు తెలియడంతో కార్పొరేటర్ ను ప్రశ్నించగా వివాదం చోటుచేసుకుంది. దాంతో కార్పోరేటర్.. అతని సోదరుల నుంచి ప్రాణభయం ఉందని అదే రోజు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మే 27న మా కుమారుడిపై కార్పొరేటర్ సోదరుడు మళ్లీ దాడి చేశాడు. ఈ అవమానభారంతో బుధవారం రాత్రి తన గదిలో ఉరివేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం గుర్తించాం… అని వాపోయారు. అయితే దాడుల ఘటనలపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. యువకుడు మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం అన్నారు.
ఆరోపణల్లో వాస్తవం లేదు
శరత్ వంశీ గౌడ్ ఆత్మహత్యతో మాకు సంబంధం లేదు. అతని కుటుంబం, వ్యక్తిగత సమస్యలు ఇందుకు కారణం కావచ్చు. నేను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదు. మాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని టిఆర్ఎస్ కార్పొరేటర్ సుక్క శివ కుమార్ తెలిపాడు.
ఇదిలా ఉండగా, మార్చి 19న హైదరాబాద్ లోని ఆల్విన కాలనీలోనూ ఇలాంటి దౌర్జన్య ఘటనే చోటు చేసుకుంది. Allwyn Colony Corporator కుమారుడు రామకృష్ణ గౌడ్ ఓ మహిళ ఇంటి పైకి వెళ్లి outrageకి దిగాడు. సదరు మహిళ ఇంట్లో లేకపోవడంతో వస్తువులను, పూల కుండీలను ధ్వంసం చేయడమే కాక చంపుతాను అంటూ హెచ్చరిస్తూ నానా రభస చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
KPHB పోలీస్స్టేషన్ పరిధిలోని ద్వారకామయి మిత్ర హిల్స్ లోని ఓ ఫ్లాట్లో రత్నమాణిక్యం ఉంటుంది. ఈనెల 16 న తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కుమారుడు రామకృష్ణ గౌడ్ ఆమె ఫ్లాట్ కు వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. కోపంతో ఊగిపోతూ.. ఇంటి బయట ఉన్న పూల కుండీలు, సింక్, కిటికీలు ధ్వంసం చేశాడు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడి వస్తువులు ఎత్తేశాడు. నిన్ను చంపేస్తాను అంటూ అరుస్తూ వెళ్ళిపోయాడు. ప్లాట్ లోని వారు వెంటనే రత్న మాణిక్యమ్మకు సమాచారం అందించారు. ఇంటికి చేరిన ఆమె జరిగిన ఘటన గురించి తెలుసుకొని కెపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ కుమారుడు ఈ దౌర్జన్యానికి పాల్పడడానికి గల కారణాలు తెలియరాలేదు.
