Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ : రెండో రోజూ హైద్రాబాద్ లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో రోజున  ఈడీ అధికారులు9 సోదాలు చేస్తున్నారు. నిన్నటి నుండి హైద్రాబాద్ లో సోదాలు  జరుగుతున్నాయి. రాబిన్ డిస్ట్రిలరీస్ కు చెందిన సంస్థ ఆర్ఓసీలో నమోదు చేసిన చిరునామాలో లేదని ఈడీ అధికారులు గుర్తించారు.

Enforcement Directorate Raids Continue Second day In Hyderabad
Author
First Published Sep 7, 2022, 9:59 AM IST

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైద్రాబాద్ లో రెండో రోజూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిన్నటి నుండి హైద్రాబాద్ లోని ఆరు చోట్ల ఈడీ అధికారులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి సికింద్రాబాద్, కోకాపేట, నార్సింగ్ లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై గత నెల 19న  సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.డిల్లీ లిక్కర్ స్కాం విషయంలో బీజేపీ ఆప్ పై తీవ్ర విమర్శలు చేస్తుంది.ఈ విషయమై తెలంగాణకు చెందిన కొందరికి ప్రమేయం ఉందని కూడా బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 

హైద్రాబాద్ లోని రాబిన్ డిస్ట్రిలరీస్ కు చెందిన సంస్థతో పాటు ఈ సంస్థకు చెందిన డైరెక్టర్లతో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరితో పాటు అరుణ్ రామచంద్రన్ పిళ్లై, అబిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ రావు,సృజన్ రెడ్డికి చెందిన సంస్థలతో పాటు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. 

సికింద్రాబాద్ లోని సరోజీనిదేవి రోడ్డులోని  నవకేతన్ టవర్స్ లో రాబిన్ డిస్ట్రిలరీస్ సంస్థ నిర్వహిస్తున్నట్టుగా ఆర్ఓసీలో నమోదు చేసుకుంది. ఈ సంస్థతో పాటు మరో నాలుగు సంస్థలు కూడా ఇదే చిరునామాపై  నమోదయ్యాయి. అయితే ఈ చిరునామాలో ఈ సంస్థలు లేవు. ఈ చిరునామాలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.  నాలుగైదు మాసాల క్రితమే ఆర్ఓసీలో రాబిన్ డిస్ట్రిలరీస సంస్థ తమ పేర్లను నమోదు చేసుకుందని ఈ కథనం తెలిపింది.ఈ చిరునామాలో నమోదైన సంస్లలు ఎక్కడి నుండి కార్యకలాపాలు సాగిస్తున్నాయనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: హైద్రాబాద్ సహా దేశంలోని పలు చోట్ల ఈడీ సోదాలు

లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 15 మందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై మనీష్ సిసోడియాతో ఇంటితో పాటు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు గతంలో సోదాలు చేశారు. మనీష్ సిసోడియా బ్యాంకు లాకర్లను కూడా సీబీఐ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా   తమపై ఆరోపణలు చేస్తుందని ఆప్ విమర్శలు చేసింది. ఈ ఏడాది జూలై మాసంలో ఢిల్లీ లిక్కర్  పాలసీని ఆప్ సర్కార్ రద్దు చేసింది. లిక్కర్ పాలసీపై  ఆరోపణలు రావడంతో  ఈ పాలసీని ఢిల్లీ సర్కార్ రద్దు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం పై 11 పేజీలతో సీబీఐ  తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఢిల్లీ డిప్యూటీసీఎం మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ కమిషనర్  ఆర్య గోపి కృష్ణ, రామచంద్రన్ పిళ్లై  వంటి వారి పేర్లను  సీబీఐ చేర్చించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios