మంత్రి గంగుల సహా పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఈడీ సోదాలు:కరీంనగర్,హైద్రాబాద్‌లలో రైడ్స్


తెలంగాణలోని కరీంనగర్ ,హైద్రాబాద్ లలో ఈడీ,ఐటీ అధికారులు జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. 

Enforcement Directorate And Income Tax joint  Raids in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలోని హైద్రాబాద్, కరీంనగర్ లలో ఈడీ,ఐటీ అధికారులు జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. 30 టీమ్ లు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి.గ్రానైట్ అక్రమాలపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.తెలంగాణ సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నివాసంతో పాటు పలువురు  గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ,ఐటీ అధికారులు బుధవారంనాడు సోదాలు నిర్వహిస్తున్నారు.మంత్రి గంగుల కమలాకర్ దుబాయ్ టూర్ లో ఉన్నారు.దీంతో  ఆయన  ఇంటి తలుపులు పగులగొట్టి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

గ్రానైట్ అక్రమాలపై ఈడీ ,ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది..కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది.సీబీఐతో పాటు ఈడీ కూడ కేసు నమోదు చేసింది.కరీంనగర్ లోని పలు గ్రానైట్ కార్యాలయాల్లో ఈడీ,ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఇవాళ ఉదయం 8 గంటల నుండి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఓ రాజకీయ నేత కనుసన్నల్లో గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో ఈ  సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.హైద్రాబాద్ లోని హైదర్ గూడ,సోమాజీగూడ లలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ లోని హైదర్ గూడ,సోమాజీగూడ లలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో   సోదాలు చేస్తున్నారని ఈ కథనం తెలిపింది. శ్వేత గ్రానైట్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు  సాగుతున్నాయి.గంగుల వెంకన్న, సుధాకర్,బోనాల రాజేశం,పొన్నంనేని గంగాధర్ రావు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని ఆ కథనం వివరించింది.

మంత్రి గంగుల కమలాకర్ సహా ఆయన సోదరుల ఇళ్లతోపాటు గ్రానైట్ వ్యాపారుల అసోసియేషన్ కు చెందిన కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని ఈ కథనం తెలిపింది.శ్వేత ఏజన్సీస్, ఏఎస్ షిప్పింగ్,జేఎం మైథాలి,.ఆదిత్యట్రాన్స్ పోర్టు ,బ్యాక్ సీ,కేవీకే ఎనర్జీ, అరవింద, సైండియా,పీఎస్ఆర్ ,శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్ కంపెనీలపై ఈడీ ,ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

also read:సాలార్ పురియా సత్వ సంస్థలో ఈడీ సోదాలు: హైద్రాబాద్, బెంగుళూరులలో తనిఖీలు

2011-13 మధ్య గ్రానైట్ అక్రమాలపై ప్రభుత్వానికి రూ.750 కోట్ల నష్టం జరిగినట్టు ఫిర్యాదులు అందాయి.ఈ  విషయమై గతంలోనే గ్రానైట్ వ్యాపారులను అధికారులు ప్రశ్నించారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios