టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆయనకే కాదు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ను ఉళ్లంఘించే విధంగా కేటీఆర్ ప్రజలకు హామీలిస్తున్నారని పలువురు కాంగ్రెస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. 

తాను పోటీ చేసే సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ నియోజకవర్గంలోని ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ఆర్ఎంపీలు, పీఎంపీలకు పుల్ టైమ్ ప్రాక్టీస్ చేసుకునేలా నిబంధనలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా నిబంధనలను సవరిస్తూ ఓ జీవో తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 

అయితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలక్షన్ కోడ్ ఉళ్ళంఘిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఈసీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది.   

ఎన్నికల ప్రచారంలో భాగంగా జాగ్రత్తగా ఉండాలని...ఎలక్షన్ కమీషన్ నిబంధనలను ఉళ్లంఘించవద్దని కేసీఆర్ ఇటీవలే టీఆర్ఎస్ అభ్యర్ధులకు సూచించారు.ఇలా సూచించిన ముఖ్యమంత్రి, అతడి తనయుడికే ఈసీ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు

కేసీఆర్ పై ఎన్నికల కమిషన్ సీరియస్, నోటీసులు జారీ