హైదరాబాద్: టీఆర్ఎస్ చీఫ్ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఉపయోగించిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే కేసీఆర్ తూ నీ బతుకు చెడ అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. 

తూ నీ బతుకు చెడ అన్న వ్యాఖ్యలు ఎందుకు చెయ్యవలసి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీకి సిఈవో నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

ఇటీవలే ఎమ్మెల్యే అభ్యర్థులతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భేటీ అయ్యారు. బీఫామ్ దరఖాస్తు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించొద్దంటూ పదేపదే సూచించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచెయ్యాలని సూచించారు. అయితే తొలిసారిగా ఆయనకే ఈసీ నోటీసులు జారీ చెయ్యడం గమనార్హం.