Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం... పోలీసులకు చిక్కిన రెండు ముఠాలు

బ్యాక్ డోర్ లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని ముఠాలు హైదరాబాద్ లో నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు చూపించే సరికి నిరుద్యోగ యువత వారిని నమ్మి మోసపోతున్నారు. ఇలా ఉద్యోగాలు రాక ముందే బాధల్లో ఉన్న నిరుద్యోగ యవతను మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. నిరుద్యోగ యువత అమాయకత్వమే పెట్టుబడిగా మార్చుకుని కొందరు మోసగాళ్లు ఈ దందా నడుపుతున్నారు.  

Eight held for duping jobless youth

నిరుద్యోగ యువత అమాయకత్వమే వారి పెట్టుబడి. బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వార ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని ముఠాలు హైదరాబాద్ లో నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి.ముందే ప్రభుత్వ ఉద్యోగమే కలగా బ్రతుకుతున్న యువత నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు చూపించే సరికి ఈజీగా నమ్ముతూ మోసపోతున్నారు. ఇలా ఉద్యోగాలు రాక బాధలో ఉన్న నిరుద్యోగ యవతను మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. వారిని మానసికంగానే కాకుండా ఆర్థికంగా దోచుకుంటున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

 ఉప్పల్ లో నివాసముంటున్న రాజేశ్,  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గంగాధర్ లు ఈ నకిలీ కన్సల్టెన్సీ ముఠాను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఏరుకొండ స్వామి, పిట్ల దాతాద్రి, ముకీరా క్రాంతికుమార్, యంసాని వీరేశం, మేక్కొండ శ్రీకాంత్‌ను ఏజంట్లుగా రెండు ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తామని వివిధ మాద్యమాల ద్వారా బాగా ప్రచారం చేసుకున్నారు. 

ఈ ప్రకటనలు చూసి సంప్రదించే నిరుద్యోగులను ఈ ముఠా సభ్యులు పకడ్బందీగా మోసం చేసేవారు. ఎక్కడా అనుమానం రాకుండా స్పెషల్ డిపార్ట్‌మెంటల్ కోటా, మినిస్టర్ కోటా ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మొదట నమ్మకాన్ని కల్గించేవారు. అనంతరం ఉద్యోగం కోసం రూ. 10 నుండి రూ.20 లక్షలు ఖర్చవుతుందని చెప్పి సగం డబ్బులు అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పేవారు. ఇలా మొత్తం డబ్బులు వసూలు చేసేవరకు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు చూపిస్తూ ఆశపెట్టేవారు. మొత్తం చెల్లించాకే ఈ లెటర్ ఇస్తామని, ఆ తర్వాతే ఉద్యోగాల్లో చేరాలని చెప్పేవారు.

ఇలా ఇప్పటివరకు వీరి చేతిలో దాదాపు 150 మంది నిరుద్యోగ యువత బలైనట్లు తెలిస్తోంది.  ఈ మోసాలపై పలు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన టాస్క్ పోర్స్ పోలీసులు ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.24 లక్షల నగదుతో పాటు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ సిపి అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios