భారీవర్షాలతో మంజీరాకు వరద: ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మూసివేత

భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని  మనదుర్గమ్మ ఆలయం తాత్కాలికంగా మూసివేశారు.
 

Edupayala Vanadurgamma Temple Shut due To Manjeera River Flood lns

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా   ఉమ్మడి మెదక్ జిల్లాలోని  ఏడుపాయల వనదుర్గ మ్మ ఆలయం గురువారంనాడు మూసివేశారు. రెండు  రోజులుగా  భారీ వర్షాల కారణంగా మంజీరా నదికి వరద పోటెత్తింది. 10 వేల క్యూసెక్కుల నీరు  దిగువకు వెళ్తుంది.   ఆలయం ముందుగా ఈ నీరు వెళ్తుంది.   దీంతో ఆలయానికి వెళ్లడానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో దేవాలయాన్ని మూసివేశారు. వరద ఉదృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు.

గత ఏడాది జూలై మాసంలో  ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు.  గత ఏడాది 24వ తేదీన  వనదుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు. గత ఏడాది కంటే  నాలుగు రోజుల ముందే   వరద ఉధృతి పెరగడంతో  ఆలయాన్ని మూసివేశారు. 

2021  సెప్టెంబర్  9వ తేదీన   మంజీరా నదికి  వరద పోటెత్తింది.  దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.   ఆలయ ఈవోకు  కరోనా రావడంతో  ఆలయాన్ని మూసివేశారు.తెలంగాణలో  రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న  నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది.   ఉత్తర తెలంగాణ ప్రాంతంలో  వర్షాలు కురిసే  అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.  దీంతో ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని అధికారులు  ప్రజలకు సూచిస్తున్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios