హైదరాబాద్: తెలంగాణ మాజీ హోం మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేస్తోంది. నాయిని నర్సింహారెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుంద రెడ్డి నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. 

ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఈడి హైదరాబాదులో పది చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. దేవికారాణి నివాసంలోనే కాకుండా పలువురి నివాసాల్లో ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని నాచారం, తదితర పది ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

వివరాలు అందాల్సి ఉంది.