హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రముఖ ఫార్మా  కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 

హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు సహా దాదాపు 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. జువెన్ ఫార్మా కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకే ఈడీ అధికారులు ఈ సోదాలు ప్రారంభించారు. అయితే ఈడీ సోదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.