హైద్రాబాద్‌లో ఈడీ సోదాలు: చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లల్లో సోదాలు
హైద్రాబాద్ నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు బుధవారం నాడు సోదాలు చేస్తున్నారు. చీకోటి ప్రవీణ్ కుమార్, మాధవ రెడ్డి ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్: Hyderabad నగరంలో ఈడీ అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. చీకోటీ ప్రవీణ్ , మాధవరెడ్డిల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చీకోటీ ప్రవీణ్ క్యాసినో ఆడించడంలో ప్రవీణ్ దిట్టగా పోలీసులు చెబుతున్నారు. గుడివాడతో పాటు హైద్రాబాద్ లో కూడా క్యాసినో ఆడిస్తూ ప్రవీణ్ పోలీసులకు చిక్కాడని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. హైద్రాబాద్ నగరంలో ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలోనే ప్రవీణ్ పై సీబీఐ కేసు నమోదు చేసినట్టుగా ఎన్టీవీ చానెల్ ప్రసారం చేసిన కథనంలో తెలిపింది.ఫెమా కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారని వివరించిందిఈ విషయమై ఐఎస్ సదన్ లోని ప్రవీణ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బోయిన్ పల్లికి చెందిన మాధవ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
జూన్ 10,11, 12, 13 తేదీల్లో బోయిన్ పల్లిలో మాధవ రెడ్డి కేసినో నిర్వహించినట్టుగా ఆరోపణలున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి నేపాల్ కు పేకాటరాయుళ్లను తరలించారు. టాలీవుడ్, బాలీవుడ్ డ్యాన్సర్లతో కేసినో సందర్భంగా డ్యాన్స్ నిర్వహించినట్టుగా ఆరోపణలున్నాయి.
ఇండో నేపాల్ సరిహద్దులోని సిలిగురి లో కేసినో శిబిరాలు నిర్వహించినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రవీణ్ కుమార్, మాధవరెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ కు సమీపంలోని ఓ హీరో ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహించిన విషయమై ప్రవీణ్ కు సంబంధాలున్నాయని కూడా పోలీసులు చెబుతున్నారని ఎన్టీవీ చానెల్ కథనం ప్రసారం చేసింది.. ప్రతి వీకేండ్ కు నేపాల్, సింగపూర్, బ్యాంకాక్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి పేకాట ఆడిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారని ఆ కథనం ప్తెలిపింది.
గుడివాడలో కేసీనో ఆడించిన విషయమై తనపై వచ్చిన ఆరోపణలను ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఈ ఆరోఫలే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో కేసీనో ఆడించలేదన్నారు. జూదం మాత్రం ఆడించిన విషయాన్ని ఆయన కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. తనపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ తెలిపారు. . సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కేసీనో నిర్వహించారని ప్రవీణ్ పై టీడీపీ నేతలు ఆరోపించారు. గోవా తరహా సంస్కృతిని గుడివాడకు తీసుకువచ్చారని ప్రవీణ్ పై టీడీపీ నేతలు విమర్శించారు.
గుడివాడలో కేసీనో విషఁయమై అప్పట్లో టీడీపీ నేతలకు, అప్పటి మంత్రి కొడాలి నానికి మధ్య మాటల యుధ్ధం సాగింది. కేసినో నిర్వహించడానికి తాను సహకరించినటట్టుగా వచ్చిన ఆరోపణలను నాని ఖండించారు. టీడీపీ నేతల తీరును ఆయన తప్పుబట్టారు ఈ విషయమై టీడీపీ నేతలు నిజనిర్ధారణకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. టీడీపీ నేతలపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. ఈ ఘటనలో టీడీపీ వర్గీయులకు గాయాలయ్యాయి. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు.