Asianet News TeluguAsianet News Telugu

డేటా లీక్ కేసు.. వెలుగులోకి మనీలాండరింగ్ కోణం, రంగంలోకి ఈడీ అధికారులు

డేటా లీక్ కేసులోని మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులతో ఈడీ అధికారులు సమావేశమైనట్లుగా తెలుస్తోంది. 

ed officials involved data leak case in cyberabad ksp
Author
First Published Mar 30, 2023, 4:04 PM IST

సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన డేటా లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వర్గాలు సైతం దర్యాప్తులో భాగమయ్యాయి. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగింది. ఈ కేసులోని మనీలాండరింగ్ కోణంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. వీరి వద్ద దేశంలోని 16.8 కోట్ల మందికి సంబంధించిన బ్యాంక్, పాన్‌కార్డ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలున్నట్లు పోలీసులు గుర్తించారు. డేటా చోరీలో బ్యాంక్, కాల్ సెంటర్లలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల పాత్ర వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విలువైన డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లినట్లుగా గుర్తించారు. ఆఫీసులకు ముందుగా వచ్చి పెన్‌డ్రైవ్‌లోకి డేటా బదిలీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ముంబై, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులని సమాచారం. జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ  అయినట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంక్‌లతో పాటు జస్ట్ డయల్‌కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అలాగే మరోసారి సైబరాబాద్ పోలీసులత భేటీ అయ్యాయి కేంద్ర వర్గాలు. డిఫెన్స్, నేవీ, ఆర్మీ ఆఫీసర్ల డేటా లీక్‌పై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. విదేశాలకు డేటా ఏమైనా లీక్ చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. డేటా లీక్‌లో రెహ్మాన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు. 

ALso REad: డేటా లీక్ కేసులో ముగిసిన రెండో రోజు విచారణ : కాల్ సెంటర్లు, బ్యాంక్ సిబ్బంది పాత్రపై అనుమానాలు.. నోటీసులు

కాగా.. వ్యక్తుల వ్యక్తిగత డేటాను అక్రమంగా యాక్సెస్ చేసి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 'నిందితులు సేకరించి, భద్రపరిచిన మొత్తం డేటాను సుర‌క్షితంగా ఉంచ‌డంతో పాటు ఎలాంటి మార్పులు చేయకుండా చూడాలని గూగుల్ కు లేఖ రాశాం. క్లౌడ్ లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషించిన తర్వాతే ఎంత సమాచారం చోరీకి గురైందో తెలుస్తుంది..' అని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.

వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ మొత్తం 12 మందిని అరెస్టు చేశామని, నలుగురికి నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. అలాగే, నిందితుల నుంచి మొబైల్‌ ఫోన్లు, ఇతర కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు కుమార్ నితీశ్ భూషణ్, కుమారి పూజా పాల్, సుశీల్ థోమర్, అతుల్ ప్రతాప్ సింగ్, ముస్కాన్ హసన్, సందీప్ పాల్, జియా యువర్ రెహ్మాన్ ను క్లౌడ్ తో పాటు హార్డ్ డిస్క్ లలో డేటాను నిక్షిప్తం చేశారని పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios