Asianet News TeluguAsianet News Telugu

ఈడీ వేధింపుల ఏజెన్సీగా వ్యవహరిస్తోంది - కవిత తరపు న్యాయవాది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో దాఖలైన పిటిషిన్ పై సోమవారం వాదనలు జరిగాయి. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. అయితే ఈ విచారణను కోర్టు ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.

ED acting as harassment agency - Kavitha's lawyer..ISR
Author
First Published Apr 2, 2024, 12:08 PM IST

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేధింపుల ఏజెన్సీగా వ్యవహరిస్తోందని ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అన్నారు. కవిత బెయిల్ కోసం ఆయన సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు వాదనలు వినిపించారు. తన క్లయింట్ పై దర్యాప్తు పూర్తిగా ప్రేరేపితమైందని కోర్టుకు తెలిపారు.

మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

ఈడీ ప్రాసిక్యూషన్ ఏజెన్సీగా కాకుండా వేధింపులకు గురిచేసే సంస్థగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కవితను పదే పదే పిలిపించారని, రోజుకో ఆపిల్ వైద్యుడికి దూరంగా ఉంచుతుందన్నట్టుగా, రోజుకో సమన్లు ఈడీని సంతోషంగా ఉంచుతుందని చెప్పారు. కవిత మధ్యంతర పిటిషన్ కోసం వాదిస్తున్నారా లేక తుది బెయిల్ పిటిషన్ కోసం వాదిస్తున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, మధ్యంతర బెయిల్, తుది బెయిల్ రెండింటి కోసం వాదిస్తున్నానని, మధ్యంతర ఉపశమనం ఇచ్చినా, నిరాకరించినా తుది ఉపశమనం పొందే అవకాశం తెరిచే ఉందని సీనియర్ అభిషేక్ సింఘ్వీ అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

‘కోర్టు ఎల్లప్పుడూ తక్కువ ఉపశమనం ఇవ్వగలదు. అది కోర్టు విచక్షణాధికారం... కోర్టు విచక్షణాధికారం చాలా విస్తృతంగా ఉంది’ అని పేర్కొన్నారు. కవిత అరెస్టు అవసరం సహా బెయిల్ కు ఐదు కారణాలను సింఘ్వీ సోమవారం ప్రస్తావించారు. కవితకు సమాజంలో లోతైన మూలాలున్నాయని, ఆమెను సాధారణ క్రిమినల్ లేదా గ్యాంగ్ స్టర్ గా పరిగణించలేమని న్యాయవాది అన్నారు.

అవినీతిపరులకు వ్యతిరేకంగా మా పోరాటం.. వారిని కాపాడేందుకు ప్రతిపక్షాల ఆరాటం - ప్రధాని మోడీ

మధ్యంతర, తుది బెయిల్ పిటిషన్ కోసం వాదిస్తున్న సింఘ్వీ వాదనను ఈడీ ప్రత్యేక స్టాండింగ్ కౌన్సెల్ జోహెబ్ హుస్సేన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా.. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై మార్చి 15వ తేదీన బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios