Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం: భయాందోళనకు గురైన ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం నాడు స్వల్పంగా భూకంపం సంబవించింది. 

Earthquake hits Telangana Asifabad, and Mancherial districts
Author
Hyderabad, First Published Oct 31, 2021, 7:19 PM IST

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం నాు భూకంపం సంభవించింది.  జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో  పాటు పలు ప్రాంతాల్లో  స్వల్పంగా  భూకంపం సంబవించింది. .దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

తెలంగాణ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇవాళ భూకంపం సంబవించింది. ప్రాథమిక సమాచారం మేరకు భూమి లోపల 77 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోపియన్ మెడిటరేయన్ సిస్మోలాజికల్ సెంటర్ నివేదిక ప్రకారంగా భూకంప తీవ్రత 4.3 గా నమోదైంది.


జగిత్యాల, రామగుండం, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భూకంపం సంబవించింది.జగిత్యాల,, మంచిర్యాల  జిల్లాలోని  బెజ్జూరు, సలుగుపల్లి, సులుగుపల్లి గ్రామాల్లో స్వల్ప Earth quake సంబవించింది. వారం రోజుల వ్యవధిలో mancherial జిల్లాలో రెండు దఫాలు భూకంపం  సంబవించడం కలకలం రేపుతుంది. ఈ నెల 24వ తేదీన  పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో భూకంపం వాటిల్లింది.

     ."

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదిక  భూకంప కేంద్రం కరీంనగర్ జిల్లాకు ఈశాన్యంగా 45 కి,మీ. మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, సిరిసిల్ల, వరంగల్ , ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలో భూమి కంపించిందని  అధికారులు తెలిపారు.మంచిర్యాల జిల్లాలోని కొన్ని కాలనీల్లో కూడ భూమి స్వల్పంగా కంపించింది. సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల్లో కూడా రాళ్లు విరిగిపడ్డాయి. 

also read:బంగాళాఖాతంలో భూకంపం, ఏపీలో కూడా కంపించిన భూమి:రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

మంచిర్యాల జిల్లాలోని కొన్ని కాలనీల్లో కూడ భూమి స్వల్పంగా కంపించింది. సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల్లో కూడా రాళ్లు విరిగిపడ్డాయి. భూకంపం వాటిల్లిన వెంటనే బొగ్గుగని కార్మికులను వెంటనే ఖాళీ చేయించారు. శ్రీరాంపూర్, నస్పూర్, సీతారాంపాల్, శ్రీశ్రీనగర్, అమ్మగార్డెన్ కాలనీల్లో భూకంపం సంబవించింది.

పెద్దపల్లి జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడం తో జనం పరుగులు తీశారు. ఆదివారం రాత్రి అరు గంటల 49 నిమిషాలకు మూడు సెకన్ల పాటు భూమి కంపిచడంతో పలు ప్రాంతాల్లో జనం బయటకు పరుగులు తీసి కలవరపడ్డారు. పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట, ముత్తారం మండలం లోని  హరిపురం, కేశనపల్లి, దర్యాపూర్ గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ అశోక్ నగర్ గాంధీ నగర్ తో పాటు పలు ప్రాంతాలు స్వల్పంగా భూమి కంపించింది. పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని వెన్నంపల్లి గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

మరోవైపు బెల్లంపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో భూమి కంపించింది. లక్సెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం, ముత్తారం మండలాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వాటిల్లింది.ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడ భూకంపం వాటిల్లిందని సమాచారం. 

తెలుగు రాష్ట్రాల్లో ఇటవల కాలంలో స్వల్ప భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టు 24న ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల భూకంపం వచ్చింి. బంగాశాఖాతంలో భూకంపం  కారణంగా ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల భూమి కంపించింది. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios