బంగాళాఖాతంలో భూకంపం, ఏపీలో కూడా కంపించిన భూమి:రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు
బంగాళాఖాతంలో మంగళవారం నాడు భూమి కంపించింది. దీని ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో పలు చోట్లు భూకంపం వాటిల్లింది
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. బంగాళాఖాతంలో కూడ ఇవాళ భూమి కంపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంపతీవ్రత 5.1 గా నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 12: 35 గంటలకు భూకంపం సంబవించిందని శాస్త్రవేత్తలు గుర్తిం,చారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూమిలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు 296 కి.మీ దూరంలో ఆగ్నేయంగా, తమిళనాడులోని చెన్నైకి 320 కి.మీ దూరంలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని తీరాల్లో భూమి లోపల 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు.ఈ భూకంపం గురించి పలువురు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు.