తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ ను కేసీఆర్ కోరారు. 

హైద్రాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ ను కేసీఆర్ కోరారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు.

శుక్రవారం సాయంత్రం పార్టీ ప్రజా ప్రతినిదులతో సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి వెళ్లారు.సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీతో పాటు ఎంపీలు వినోద్, సంతోష్ కూడ ఉన్నారు.

సెప్టెంబర్ రెండో తేదిన ప్రగతి నివేదన సభను కేసీఆర్ నిర్వహించనున్నారు.ఈ సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతనను సంతరించుకొంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ గురువారం నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ తో సమావేశం కావడం కూడ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతకు కారణమైంది.

పార్టీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడ కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ఇతరత్రా విషయాలపై ప్రధానితో పాటు పలువురు మంత్రులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

అయితే ముందస్తు ఎన్నికల విషయమై కూడ కేంద్ర పెద్దలతో కేసీఆర్ చర్చించే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కీలక సమావేశం ముగించుకొని కేసీఆర్ నేరుగా ఢిల్లీకి చేరుకోవడం తెలంగాణలోని రాజకీయ పార్టీల్లో ఆసక్తిని రేపుతోంది.

ఈ వార్తలు చదవండి

ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు: కేసీఆర్ ముందస్తు సంకేతాలు

ముందస్తు ఎన్నికలు: సెప్టెంబర్ 6న అభ్యర్థుల ప్రకటన?

20 రోజుల్లో రెండో సారి హస్తినకు కేసీఆర్: ముందస్తుపై పుకార్ల జోరు