హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం గజ్వేల్ నియోజవకర్గంలోని  ఫామ్‌హౌజ్‌కు చేరుకోనున్నారు.  కేబినెట్ సమావేశం తర్వాత ఫామ్‌హౌజ్‌కు చేరుకొంటారు.

గురువారం మధ్యాహ్నం కేసీఆర్  మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ సమాచారంలో  అసెంబ్లీ రద్దుకు సంబంధించిన విషయమై కేసీఆర్ కేబినెట్  సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం.

ఈ కేబినెట్ సమావేశం కేవలం 30 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అసెంబ్లీ రద్దు గురించి  తీర్మానం  చేసిన తర్వాత గవర్నర్ ను  కలిసి అసెంబ్లీ రద్దు గురించి  తీర్మానం కాపీని అందించనున్నారు.

టీఆర్ఎస్ భవన్ లో  మీడియా సమావేశం తర్వాత కేసీఆర్  సాయంత్రం ఆరు గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలోని  ఫామ్ హౌజ్‌కు   చేరుకొంటారు.  శుక్రవారం నాడు కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లిలోని  వెంకటేశ్వరస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.

కేసీఆర్ కు ఈ ఆలయంలో పూజలు చేయడం సెంటిమెంట్.ఈ ఆలయంలో పూజలు చేసిన తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగే  బహిరంగసభలో పాల్గొనేందుకు కేసీఆర్ బయలుదేరుతారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్  ఇంట్లో కొద్దిసేపు సేద తీరిన తర్వాత  కేసీఆర్ హుస్నాబాద్  బహిరంగ సభలో  పాల్గొంటారు. 

కేసీఆర్ సెంటిమెంట్లను నమ్ముతాడు. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల కార్యక్రమాలను పాల్గొనడం సంప్రదాయం. అయితే ఈ సంప్రదాయాన్ని కూడ పాటించనున్నారు.

రేపు కూడ కోనాయిపల్లి ఆలయంలో కేసీఆర్ వెంటకేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఈ సెంటిమెంట్ గత ఎన్నికల సమయంలో కలిసొచ్చింది.. ఈ దఫా కూడ కలిసొస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

 

నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ భేటీ: తెలంగాణ అసెంబ్లీ రద్దు?

నేడు గవర్నర్ నరసింహాన్ షెడ్యూల్ ఇదీ
అసెంబ్లీ రద్దుకు తిరుగులేని ముహూర్తం పెట్టించిన కేసీఆర్