సమకాలీన రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది విభిన్న శైలి. ఆయన అడుగు తీసి అడుగు వేయాలన్నా.. ఏ పని చేయాలన్నా.. వారాలు, తిథులు, ముహూర్తాలు చూడటం అలవాటు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది కూడా.

అలాంటిది ఏకంగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల సమరానికి వెళుతున్నారంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ముందుస్తు ఎన్నికలకు కూడా జ్యోతిష్యం సెంటిమెంట్‌ను సీరియస్‌గా ఫాలో అయిపోతున్నారు

గురువారం 6వ తేదీ..  ఏకాదశి తిథి.. కేసీఆర్ లక్కీ నెంబర్ 6.. హిందూ శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున తలపట్టిన ఏ కార్యక్రమం అయినా దిగ్విజయంగా నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. అలాగే అసెంబ్లీ రద్దుకు కూడా పండితుల వద్ద కేసీఆర్ బలమైన ముహూర్తం పెట్టించారు. గురుపుష్య యోగంలో అసెంబ్లీని రద్దు చేయాలని వేద పండితులు ముఖ్యమంత్రికి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.