Asianet News TeluguAsianet News Telugu

దుబాయ్ వెళ్లే విమానం హైజాక్.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు మెయిల్..

దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది విమానాన్ని రద్దు చేశారు. 

Dubai flight Hijacked..Threatening mail sent to Shamshabad airport - bsb
Author
First Published Oct 9, 2023, 7:43 AM IST

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ నుంచి దుబాయ్ కి వెళ్లే విమానం హైజాక్ చేయబోతున్నట్లు ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది దుబాయ్ వెళ్లే విమానంలో తనిఖీలు చేపట్టారు. 

మెయిల్ వచ్చి ఐపీ అడ్రస్ ను టెక్నికల్ టీం  ఆరా తీస్తుంది. దుబాయ్ దుబాయ్ వెళ్ళే విమానం రద్దు చేశారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios