ప్రపంచం మునిగిపోతదా మాటపై  కాక మీదున్న నిరుద్యోగులు కొలువులకై కొట్లాట సభ తో సర్కారులో ఆందోళన సిఎం జిల్లాల టూర్ లో అభ్యర్థులు నిరసన తెలిపే అవకాశాం సుప్రీంకోర్టు గండాన్ని గట్టెక్కేందుకు ఈ మార్గం ఎంచుకున్నారా?

‘డిఎస్సీ వేయకపోతే ప్రపంచం ఏమైనా మునిగిపోతుందా? డిఎస్సీకి ఏం తొందరొచ్చింది’ అని ముఖ్యమంత్రి కేసిఆర్ నాలుగు రోజుల కింద చేసిన కామెంట్ ఇది. వెంటనే మరోరోజు కొత్త జోన్లు, కొత్త జిల్లాల ప్రకారంగా ఉద్యోగాల భర్తీ అంటూ సమీక్ష తర్వాత విషయాన్ని వెల్లడించిన సర్కారు. ఈ పరిణామాలు చూస్తే త్వరలో డిఎస్సీ కాదుగదా? ఇప్పట్లో డిఎస్సీ కూడా ఉండే అవకాశం లేదన్న ఆలోచనలోకి వెళ్లిపోయారు నిరుద్యోగ అభ్యర్థులు. కానీ ఏమైందో ఏమో సీన్ మారిపోయింది. త్వరలో డిఎస్సీ అంటూ లీకులు వచ్చేశాయి. కొద్దిసేపటి క్రితమే డిఎస్సీ 2017 రూల్స్ పేరుతో అర్హతలు, నిబంధనలు విడుదల చేసి నిరుద్యోగులకు షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఇదంతా నిజమేనా? నిజంగానే ఉద్యోగాలివ్వడానికేనా? లేదా కొలువుల కై కొట్లాట గండం గట్టెక్కే ప్లాన్ వేశారా అన్న అనుమానాలను నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే సిఎం కేసిఆర్ తెలంగాణ జిల్లాల్లో పర్యటనకు అడ్డు తగలకుండా ఉండేందుకు ఈ సీన్ క్రియేట్ చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు dsc పై ముందుకి పోవడం వెనక కారణాలు లేకపోలేదు. సరిగ్గా 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి kcr డీఎస్సి వేయకపోతే ప్రపంచం మునిగిపోతాదా అన్నారు. దానిపై డీఎస్సి అభ్యర్థులతో పాటు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. టీచర్ అభ్యర్థులు కేసిఆర్ సర్కారు మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాజా జిఓ మీద వారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవేమంటే?

1 నాలుగు రోజుల కిందట ప్రపంచం మునిగిపోద్దా అన్నవారు ఈ నాలుగు రోజుల్లోనే ఏం జరిగి ఉండొచ్చు?

2 తెలంగాణ ప్రభుత్వం అసలు ఎందుకు యు టర్న్ తీసుకుంది?

3 ఇప్పటికిప్పుడు dsc పై కదలిక ఎందుకు వచ్చినట్లు?

4 అసలు నోటిఫికేషన్ వస్తదా.. లేదా ఉత్తుత్తి కాయితాలు విడుదల చేసి చేతులు దులుపుకుంటారా?

5 ఇది మళ్ళీ కొత్త "త్వరలో డిఎస్సీ" నాటకము కొనసాగింపా ?

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు సంబందించిన కేసు సుప్రీంకోర్టు లో నడుస్తున్నది. సుప్రీం చరిత్రలో మొదటిసారిగా నియామకాలకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తెలంగాణలో dsc వేయకపోవడానికి గలా కారణాలు తెలపాల్సిన పరిస్థితి ఉంది. అసలు dsc వేయకపోవడానికి ప్రత్యేకించి కారణాలు లేవు కాబట్టి, dsc నోటిఫికేషన్ ఇస్తే ఆ విచారణలో ముఖ్యకార్యదర్శి ని విచారించే అవకాశం ఉండదు. అందుకే ఇప్పటికిప్పుడు dsc పై కదలిక వచ్చిందని నిరుద్యోగులు అనుమానిస్తున్నారు.

ఇందులో ఇంకో కిటుకు ఉంది. అది ఏంటంటే... తెలంగాణలో నూతన జిల్లాలకు సంబంధించిన ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. కాబట్టి ఇప్పుడు నూతన జిల్లాల వారిగా dsc నోటిఫికేషన్ ఇస్తే ప్రతిపక్ష పార్టీలు, ఉమ్మడి జిల్లాల నోటిఫికేషన్ కోరుకునే వాళ్ళు తిరిగి కోర్టు ను ఆశ్రయిస్తరు. అప్పుడు నూతన జిల్లాల dsc నోటిఫికేషన్ పై స్టే వస్తది.

సుప్రీం దృష్టిలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు అవుతుంది. కోర్టులకు వెళ్లేలా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా సమస్య కోల్డ్ స్టోరేజీలోకి వెళ్తుంది. స్టే రావాలని, కావాలనే నూతన జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కనబడుతోందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. మేము dsc వేస్తే ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు పోయి స్టే తెస్తున్నారు అని పాత పాట పాడడం ఇక్కడ జరగబోతుంది అనేది వాస్తవంగా కనిపిస్తుందని నల్లగొండకు చెందిన డిఎస్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఏషియా నెట్ కు తెలిపారు. సర్కారు తీసుకుంటున్న స్టెప్స్ లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. కేవలం నిరుద్యోగులను మోసం చేయడం కోసం మరో నాటకానికి తెర తీశారు తప్ప ఇది ఏమాత్రం చిత్తశుద్ధితో కూడిన వ్యవహారం కాదని ఆయన ఆరోపించారు. ఇటు సుప్రీంకోర్టు గండాన్న, అటు జెఎసి తలపెట్టిన కొలువులకై కొట్లాట గండాన్ని గట్టెక్కేందుకే ఈ డ్రామా షురూ అయిందన్నారు. మూడేళ్లుగా లేని హడావిడి ఇప్పుడే చేస్తున్నారంటే కారణం అందరికీ తెలుసన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/bJeE3b