తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వాహన శ్రేణికి ఊహించని అనుభవం ఎదురైంది.

సికింద్రాబాద్ లోని ఖార్ఖానా  వైపు సిఎం కేసిఆర్ కాన్వాయ్ వెళ్తున్నది.

ఆ సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిపి వేశారు.

జనాలను కూడా రోడ్డు మీదకు రానీయలేదు.

అయితే కాన్వాయ్ వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఒక వ్యక్తి తప్పతాగి సిఎం కాన్వాయ్ కి అడ్డుగా వచ్చాడు.

 దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ఆ వ్యక్తిని అక్కడ బందోబస్త్ లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.

ఆ వ్యక్తి తప్పతాగి సిఎం కారుకు అడ్డు రావడంతోనే అదుపులోకి తీసుకున్నట్లు మహాంకాళి ఎసిపి వినోద్ తెలిపారు.

సిఎం కేసిఆర్ ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. 

ఈ సంఘటనకు బాధ్యుడైన ఎస్సై పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.

దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.