భార్యపై కోపంతో తాగేసి బాలున్ని ఆటోకేసి కొట్టిన తండ్రి (వీడియో)

Drunk man bangs 3-yr-old son against auto-rickshaw after quarrel with wife
Highlights

తప్పతాగిన ఓ తండ్రి మానవత్వాన్ని మరిచిపోయాడు. తన రక్తం పంచుకుని పుట్టిన చిన్నారి కొడుకని కూడా చూడకుండా అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. తల్లి ఒడిలోనుంచి చిన్నారిని తీసుకుని ఆటోకేసి కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

తప్పతాగిన ఓ తండ్రి మానవత్వాన్ని మరిచిపోయాడు. తన రక్తం పంచుకుని పుట్టిన చిన్నారి కొడుకని కూడా చూడకుండా అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. తల్లి ఒడిలోనుంచి చిన్నారిని తీసుకుని ఆటోకేసి కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ జగద్గిరిగుట్ట కు చెందిన శివగౌడ్ ఆటో డ్రైవర్. ఇతడు మద్యానికి బానిసయ్యాడు. దీంతో నిత్యం తాగివచ్చి భార్యను వేధించేవాడు. అలాగే నిన్న మద్యాహ్నం కూడా ఫుల్లుగా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. ఈ గొడవలో భార్యా భర్తల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో శివగౌడ్ భార్యపై కోపాన్ని తమ 3 ఏళ్ల బాబుపై చూపించాడు.

ఇంట్లో పడుకుని ఉన్న బూడేళ్ల చిన్నారిని బయటకు తీసుకువచ్చి అత్యంత పాశవికంగా ఆటోకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా గాయాలపాలైన చిన్నారిని ఎత్తుకుని మళ్లీ దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని పట్టుకుని చిన్నారిని కాపాడారు.

ఈ దాడితో చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బాబుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. చిన్నారి బాధ్యతను పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. 

 అయితే ఈ ఘటనకు కారణమైన భర్తపై ఫిర్యాదు చేయడానికి భార్య ఒప్పుకోలేదు. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీసీలోని 324, జువైనల్ జస్టిస్‌లోని 75వ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చిన్నారిపై దాడిచేసిన ఉన్మాది పరారీలో ఉన్నాడు.  
   
 

loader