Asianet News TeluguAsianet News Telugu

రాయదుర్గంలో రాజమండ్రి డ్రగ్స్ స్మగ్లర్లు... ఎట్టకేలకు విక్కీ గ్యాంగ్ దొరికింది...

సంపన్నులు, ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న రాజమండ్రి యువకుల ముఠా ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. 

Drugs  smuggling gang arrest in Hyderabad AKP
Author
First Published Oct 9, 2023, 12:39 PM IST | Last Updated Oct 9, 2023, 12:48 PM IST

హైదరాబాద్ : సంపన్నులు, ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇలా నగరంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ముగ్గురు రాజమండ్రి యువకుల ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ కదలికలపై నిఘా వుంచిన పోలీసులు ఎట్టకేలకు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  

రాజమండ్రికి చెందిన విక్కి, గోపి, రాజేష్, నరేష్ హైదరాబాద్ లో నివాసముంటున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ వీరు ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందాలోకి దిగారు. గోవా నుండి హైదరాబాద్ కు గుట్టుగా కొకైన్ తీసుకువచ్చి విక్రయించేవారు. సంపన్నులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వుండే ప్రాంతాలను ఈ డ్రగ్స్ దందాకు అడ్డాగా మార్చుకున్నారు.  

ఈ గ్యాంగ్ డ్రగ్స్ స్మగ్లింగ్, అమ్మకాలపై గతేడాదే పోలీసులకు సమాచారం అందింది. కానీ పోలీసుల కళ్లుగప్పి ఇంతకాలం డ్రగ్స్ విక్రయించారు. ఎట్టకేలకు రాయదుర్గంలో ఈ గ్యాంగ్ కదలికలను గుర్తించిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద 32 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్వోటీ పోలీసులు.  

Read More  Navdeep: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు ఈడీ నోటీసులు

పట్టుబడిన నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గ్యాంగ్ లో విక్కీ కీలకమైన స్మగ్లర్ గా పోలీసులు గుర్తించారు. అతడే గోవానుండి డ్రగ్స్ తీసుకురావడం... హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన గ్యాంగ్ ద్వారా విక్రయించడం చేసేవాడని తెలుస్తోంది. ఈ గ్యాంగ్ వద్ద డ్రగ్స్ కొనుగోలుచేసినవారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. 

ఇదిలావుంటే ఇటీవల ఓ మహిళతో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా గన్నేరువరంకు చెందిన వివాహిత అనురాధ పలు కారణాలతో భర్తకు దూరంగా హైదరాబాద్ లో వుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ప్రాంతంలోనే ప్రముఖ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి తో పరిచయం ఏర్పడింది.  వీరిద్దరు కలిసే హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేపట్టారు. 

ప్రగతినగర్ లోని ఓ మిత్రుడి ద్వారా గోవాలో డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రదారి జేమ్స్ తో వీరికి పరిచయం ఏర్పడింది. అతడితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ గోవా నుండి ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్ కు డ్రగ్స్ చేరవేసేది అనురాధ. ఆ డ్రగ్స్ ను తనకు తెలిసినవారి ద్వారా ప్రభాకర్ రెడ్డి విక్రయించేవాడు. ఇలా కొంతకాలంగా డ్రగ్స్ దందా చేస్తున్న అనురాధ, ప్రభాకర్ రెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసారు.

ఇదిలావుంటే ఇటీవల ఇదే హైదరాబాద్ నగరంలో ఓ మహిళతో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా గన్నేరువరంకు చెందిన వివాహిత అనురాధ పలు కారణాలతో భర్తకు దూరంగా హైదరాబాద్ లో వుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ప్రాంతంలోనే ప్రముఖ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి తో పరిచయం ఏర్పడింది.  వీరిద్దరు కలిసే హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేపట్టారు. 

ప్రగతినగర్ లోని ఓ మిత్రుడి ద్వారా గోవాలో డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రదారి జేమ్స్ తో వీరికి పరిచయం ఏర్పడింది. అతడితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ గోవా నుండి ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్ కు డ్రగ్స్ చేరవేసేది అనురాధ. ఆ డ్రగ్స్ ను తనకు తెలిసినవారి ద్వారా ప్రభాకర్ రెడ్డి విక్రయించేవాడు. ఇలా కొంతకాలంగా డ్రగ్స్ దందా చేస్తున్న అనురాధ, ప్రభాకర్ రెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios