హైదరాబాద్: రాజేంద్రనగర్‌‌లోని నగల వ్యాపారి రాజేంద్రప్రసాద్ అగర్వాల్‌ ఇంట్లో  దోపీడీకి పాల్పడిన కేసులో  పోలీసులు  డ్రైవర్‌నే నిందితుడిగా తేల్చారు.  నిందితుడి కోసం పోలీసులు బీహార్‌‌కు పంపారు

రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్‌ సమీపంలో నివాసం ఉంటున్న  రాజేంద్రప్రసాద్ అగర్వాల్ అనే నగల వ్యాపారి ఇంట్లో దోపీడీ దొంగలు భీభత్సం సృష్టించారు.  వృద్ధ దంపతులను  కట్టేసి, నోటికి ప్లాస్టర్ అంటించి రూ. 50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలను దోచుకొన్నారు.ఈ ఘటన ఆగష్టు 17వ తేదీ తెల్లవారుజామున చోటు చేసుకొంది.

రాజేంద్రప్రసాద్ అగర్వాల్‌ దంపతులకు ఇద్దరు కుమారులు దీపక్‌, రోహిత్‌తోపాటు ఇద్దరు కుమార్తెలు పూజ, రేఖ ఉన్నారు.రోహిత్ తండ్రి వద్దే ఉండేవాడు. అయితే రోహిత్ భార్యకు తల్లిదండ్రులకు పడకపోవడంతో రోహిత్ ఆరు మాసాల క్రితమే  న్యూ ఫ్రెండ్స్ కాలనీకి మకాం మార్చాడు.అయితే ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున  గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను బంధించి దోపీడికి పాల్పడ్డారు

ఈ కుటుంబం  వద్ద ఇప్పటివరకు  ఆరుగురు వ్యక్తులు డ్రైవర్లుగా పనిచేశారు.అయితే ప్రస్తుతం డ్రైవర్ గా పనిచేస్తున్న వారిపై  పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన నాటి నుండి డ్రైవర్ ఆచూకీ లేకుండా వెళ్లాడు.  వృద్ద దంపతులు ఇంట్లో ఎక్కడ డబ్బులను పెడతారనే విషయాలు కూడ డ్రైవర్‌కు తెలుసునని కుటుంబసభ్యులు  పోలీసులు చెప్పారు. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బీహార్ రాష్ట్రానికి పోలీసు బృందం వెళ్లింది.