ఏడాది చివరకు రాష్ట్రమంతా ఇంటింటికి మంచినీరు

drinking water to every house in Telangana by year end
Highlights

ఈ యాసంగి నుంచి రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చేందుకు కృషి చేస్తం. ఈ ఏడాది చివరి నాటికి ఇంటింటికీ మంచినీరందిస్తం. అట్టడుగు ఉద్యోగాలుచేస్తున్న వారి వేతనాలను భారీగా పెంచాం. రవాణా రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నం.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన  తర్వాతమూడేళ్లలోనే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని పంచిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు (కెసిఆర్) అన్నారు.

 

మూడవ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్బంగా ఈ రోజు ముఖ్యమంత్రి గన్ పార్కు వద్ద అమరవీరులకు మొదట నివాళులర్పించారు.

 

అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఎగరవేశారు.  వేడుకలను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపటి నుంచి 15వేల విలువైన కేసీఆర్ కిట్ల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. గర్భిణీల వైద్యపరీక్షల కోసం మూడు విడతలుగా రూ.12 వేలు అందిస్తామని ఆయన తెలిపారు.

 

తెలంగాణా ప్రాంతాన్ని వెంటాడిన విద్యుత్ సమస్యలను అతనికాలంలోనే పరిష్కరించామని ఆయన ప్రకటించారు. ‘ఈ యాసంగి నుంచి రైతులకు 24గంటలు కరెంట్ ఇచ్చేందుకు కృషి చేస్తం. ఈ ఏడాది చివరి నాటికి ఇంటింటికీ మంచినీరందిస్తామం. అట్టడుగు ఉద్యోగాలుచేస్తున్న వారి వేతనాలను భారీగా పెంచాం. రవాణా రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నం,’ సీఎం చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణాను నిలపగలిగామని ఆయన చెప్పారు.  
 

loader