Asianet News TeluguAsianet News Telugu

అధిక ఫీజులు వసూలు చేయొద్దు: ప్రైవేట్ స్కూల్స్ కు హైకోర్టు ఆదేశం

స్కూల్స్ ప్రారంభించిన తర్వాత అదిక ఫీజులు వసూలు చేయవద్దని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది.

donot charge extra fee Telangana High court orders to private schools lns
Author
Hyderabad, First Published Jan 22, 2021, 5:22 PM IST

హైదరాబాద్: స్కూల్స్ ప్రారంభించిన తర్వాత అదిక ఫీజులు వసూలు చేయవద్దని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది.

ఫిబ్రవరి 1వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపీడీపై హైద్రాబాద్ స్కూల్స్ పేరేంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు శుక్రవారం నాడు విచారణ చేసింది.

ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేరేంట్స్ అసోసియేషన్ ఆరోపించింది.  ఆన్ లైన్ విద్య పేరుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అధికఫీజులు వసూలు చేస్తున్నాయని పలువురు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

ఫీజుల వసూలుపై ప్రభుత్వం జారీ చేసిన 46 జీవోను కొన్ని స్కూల్స్ ఉల్లంఘిస్తున్నాయని ఈ పిటిషన్లలో ఆరోపించాయి. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ సమయంలో కూడ కొన్ని ప్రైవేట్ స్కూల్స్  బలవంతంగా ఫీజులు వసూలు చేశాయని పేరేంట్స్ అసోసియేషన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios