government hospitals: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో కుక్కలు, పిల్లులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాగే, ఆయా ఆస్పత్రుల్లో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ కూడా ఆందోళన కలిగిస్తోంది. అధికారులు మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రులకు వచ్చేవారితో పాటు ఇప్పటికే అందులో ఉన్న రోగులు కోరుతున్నారు.
government hospitals: తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదరణ పెరుగుతుండగా మరోవైపు రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైద్యారోగ్య శాఖ అధికారులు విఫలమవుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో పెద్దాస్పత్రులైన ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పిల్లులు, కుక్కల బెడద ఉంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పిల్లులు, కుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల వార్డుల్లో దోమలు, ఈగల బెడదపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మెరుగైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వార్డులు శుభ్రం చేయడం, టాయిలెట్ల శుభ్రత నిర్లక్ష్యంగా ఉంటుందని రోగులు, వారి వెంట వున్న రోగుల బంధువులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు సైతం ఈ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆరపణలు వస్తున్నాయి.
ఇటీవల వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో ఉన్న రోగిని ఎలుకలు కొరికిన ఘటన ఆస్పత్రుల్లో భద్రత, పరిశుభ్రత లోపానికి నిదర్శనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐసీయూలోనే రోగుల పరిస్థితులు ఇలా ఉంటే సాధారణ వార్డుల పరిస్థితి ఎలా ఉంటుందనేతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషలిస్ట్ ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే రెండేళ్లలో 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు పరిశుభ్రత పాటించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తుచేస్తున్నారు.
సెక్యూరిటీ మరియు క్లీనింగ్ సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉండటంతోనే ఈ పరిస్థితులు ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు. మరుగుదొడ్లు మూడుసార్లు కాకుండా రోజుకు ఒకసారి శుభ్రం చేయడంతో అపరిశుభ్రంగా ఉన్నాయి. ఉన్న కార్మికులతో పాటు అధికారులు సైతం పరిశుభ్రత అంశాలను పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.
జీడబ్ల్యూఎంసీలో వీధికుక్కలు, కోతుల బెడద పెరుగుతోంది !
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని బాలసముద్రం, గోకుల్ నగర్, కాకతీయ యూనివర్శిటీ సమీపంలోని శ్రీనగర్ కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ఆయా కాలనీల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కోతులు పగటిపూట సమస్యలను సృష్టిస్తే, కుక్కలు రాత్రిళ్లు తమ మొరుగుతో ప్రజలను నిద్రలేని రాత్రులుగా మిగులుస్తున్నాయి. బాలసముద్రం స్థానికులు మాట్లాడుతూ.. బాలసముద్రంలోని ల్యాండ్‌మార్క్ హోటల్ వెనుక 20కి పైగా వీధి కుక్కలు ఉన్నాయి. ఈ అపరిశుభ్రమైన కుక్కల వల్ల మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము, ఇవి నిరంతరం మొరుగుతూ.. ప్రజలపై కూడా దాడి చేస్తాయి. ఈ విషయాన్ని అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు.
అలాగే, KU క్యాంపస్ సమీపంలోని శ్రీ నగర్ కాలనీలో నివసిస్తున్న ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, కోతులు తమ ఇంటి తోటలోని మొక్కలు మరియు చెట్లను తరిమికొట్టడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ తరచుగా వాటిని నాశనం చేస్తున్నాయని చెప్పారు. "వాటిని తరిమికొట్టడానికి మేము క్రాకర్లు పేల్చవలసి వస్తుందని తెలిపారు.
