పురుటి నొప్పులతో ఆస్పత్రికి వెడితే.. కడుపులో బట్టపెట్టి కుట్టేసిన డాక్టర్లు..
లుకూరు గ్రామానికి చెందిన దండు మంగమ్మ డెలవరీ కోసం నవంబర్ 28న మండల పరిధిలోన భాస్కర ఆస్పత్రికి వెళ్లింది. 29న ఉదయం డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బైటికి తీశారు. ఆపరేషన్ సమయంలో కాటన్ గుడ్డను కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు వేశారు. పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకున్నారు. కానీ కుట్లు మానలేదు.. కడుపునొప్పి తగ్గలేదు..
మొయినాబాద్ : ఆపరేషన్ చేసి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చారు డాక్టర్లు. పురుటి నొప్పులతో వచ్చిన మహిళకు Surgery చేసి కడుపులో Cotton
Clothపెట్టి కుట్లు వేశారు. పది రోజుల తర్వాత తమతో కాదని చేతులెత్తేశారు. చివరికి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆపరేషన్ చేసి కాటన్ గుడ్డను బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడింది.
వివరాల్లోకి వెడితే.. Mainabad Zone చిలుకూరు గ్రామానికి చెందిన దండు మంగమ్మ డెలవరీ కోసం నవంబర్ 28న మండల పరిధిలోన భాస్కర ఆస్పత్రికి వెళ్లింది. 29న ఉదయం డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బైటికి తీశారు. ఆపరేషన్ సమయంలో కాటన్ గుడ్డను కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు వేశారు.
పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకున్నారు. కుట్లు ఎంతకూ మానకపోవడంతోపాటు Stomach ache రావడంతో భర్త మాణిక్యం డాక్టర్లను ప్రశ్నించాడు. దీంతో ఎక్స్ రేలు తీయిస్తూ, మందులు తెప్పిస్తూ కాలయాపన చేశారు. ఎంతకూ తగ్గకపోవడంతో చేసేది లేక Osmania Hospitalకి తీసుకెళ్లాలని చెప్పడంతో ఈ నెల 8న అక్కడికి తీసుకెళ్లారు.
అక్కడి డాక్టర్లు సైతం కాదని చెప్పడంతో అదే రోజు రాత్రి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు Scanning చేసి కడుపులో ఏదో గుడ్డ ఉందని గుర్తించారు. శుక్రవారం ఆపరేషన్ చేసి ఆ గుడ్డముక్కను బైటికి తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
డాక్టర్లను ప్రశ్నించిన భర్త మాణిక్యం...
మాణిక్యం, బంధువులతో కలిసి శనిారం సాయంత్రం భాస్కర ఆస్పత్రికి వచ్చి డాక్టర్లను నిలదీశారు. పెద్ద డాక్టర్లు లేరని, సోమవారం వచ్చి మాట్లాడండి అంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లగొట్టారని మాణిక్యం తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంచందర్ రావు వివరణ కోరగా రెండు రోజులుగా సెలవులో ఉన్నానని, సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపతామన్నారు.
శిల్పా చౌదరికి షాక్: బెయిల్ తిరస్కరించిన కోర్టు, పోలీస్ కస్టడీకి మరోసారి అనుమతి
ఇదిలా ఉండగా, అక్టోబర్ 30న సిరిసిల్లలో అలాంటి దారుణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. కడుపు నొప్పితో సిరిసిల్లాలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కడుపులోనే సూది, దారం మరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళకు ఇటీవల మళ్లీ కడుపునొప్పి వస్తుండడంతో స్కానింగ్ చేయించుకోగా అసలు విషయం వెలుగు చూసింది.
సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరా నగర్ కు చెందిన లచ్చవ్వ Abdominal painతో బాధపడుతూ నాలుగేళ్ల క్రితం సిరిసిల్లాలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు Uterine operation చేశాడు.
కొన్నాళ్ళకు కడుపులో నొప్పి రావడంతో తాత్కాలిక ఉపశమనం కోసం ఆమె టాబ్లెట్లు వాడింది. ఇటీవల pain తీవ్రం కావడంతో స్కానింగ్ చేయించి కడుపులో ఉన్నట్లు నిర్ధారించారు. గర్భసంచి ఆపరేషన్ సమయంలో కుట్లు వేయడానికి ఉపయోగించిన Needle, thread కడుపులోనే మర్చిపోవడంతో తరచు ఈ కడుపు నొప్పి వస్తున్నట్లు తెలిపారు.
అయితే అప్పుడు ఆపరేషన్ చేయించుకున్న ఆసుపత్రి వివిధ కారణాలతో మూతపడింది. ప్రస్తుతం మరో చోట పనిచేస్తున్న వైద్యుడిని సంప్రదిస్తే తనకు సంబంధం లేదని, దిక్కున్న చోట చెప్పుకో అని అనడంతో బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది. తనకు న్యాయం చేయాలని లచ్చవ్వ వేడుకుంటుంది.