Asianet News TeluguAsianet News Telugu

నర్సుపై డాక్టర్ లైంగిక దాడి, పెళ్లిపేరుతో వంచన... కేసుపెడితే, బెయిల్ పేపర్లతో పీఎస్ కు వచ్చి....

పెళ్లి పేరుతో నమ్మించి తనమీద పలుమార్లు డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ నర్సు గతనెలలో ఫిర్యాదు చేసింది. కాగా అప్పటినుంచి పరారీలో ఉన్న ఆ డాక్టర్ హాఠాత్తుగా బెయిల్ పేపర్లతో పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు. 

Doctor sexual attack on nurse in the name of marriage in hyderabad
Author
First Published Sep 6, 2022, 10:13 AM IST

హైదరాబాద్ : నర్సుపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో రామ్ నగర్ కు చెందిన కోటం సందీప్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసు స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. గత నెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై నారాయణగూడ పోలీసులు అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే, వైద్య పరారీలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. ఈలోగా  అతడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం సోమవారం నిందితుడు కోటం సందీప్ భరద్వాజ్ కు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. 

బెయిల్ పేపర్లతో నిందితుడు, అతని తండ్రి  పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. హిమాయత్ నగర్ లోని మ్యానికైండ్ ఆస్పత్రిలో బాధితురాలు నర్సుగా, సందీప్ భరద్వాజ్ వైద్యుడిగా చేసేవారు. నైట్ షిఫ్ట్ లో ఉన్న నర్సును పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో దాడి చేయడంతో ఆమె గత ఏడాది రెండుసార్లు నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం: హైద్రాబాద్ సహా దేశంలోని పలు చోట్ల ఈడీ సోదాలు

అప్పట్లో పోలీస్ అధికారి అతడికి వార్నింగ్ ఇవ్వడంతో.. పోలీసుల ఎదుట పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆర్య సమాజ్ కు తీసుకువెళ్లి.. వెనక్కి తీసుకు వచ్చాడు. ఇటీవల మరో మారు పెళ్లి ప్రస్తావన తేవడంతో తన రాజకీయ పలుకుబడితో ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. సుమారు 25 రోజుల పాటు నిందితుడి ఆచూకీ తెలియలేదు. పరారీలో ఉన్నట్లు పోలీసులు కాలయాపన చేశారు. అతడిని అరెస్టు చేయకుండా,  ముందస్తు బెయిలు వచ్చేలా పోలీసులు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో ఈ నెల 2న వెలుగులోకి వచ్చింది. అయితే, అతను  ఓ పోలీస్..  ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు.  ఐ లవ్ యూ అంటూ ఆమెను దగ్గరయ్యాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్ళి విషయం ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఫిరోజాబాద్ కు చెందిన యువతి (24)తో కానిస్టేబుల్ అమిత్ యాదవ్ కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుంటానని అమిత్ తెలిపాడు. దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. ఆ తరువాత కాబోయే భర్తే కదా అని.. అతని మాయ మాటలు నమ్మి, ఆమె అతడికి శారీరకంగా దగ్గరయ్యింది. 
అయితే, ఆ తరువాత పెళ్ళి విషయం ఎత్తగానే.. ఏదో సాకు చెబుతూ పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో, బాధితురాలు.. అమిత్ యాదవ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిని అడిగింది. అలా 2021లో వీరిద్దరికీ పెళ్లి చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ, కట్నం విషయంలో తేడాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి వాయిదా పడింది.ఈ క్రమంలో మరోసారి పెళ్లి విషయమై అమిత్ ను నిలదీయగా.. అదనపు కట్నం కావాలని కోరినట్లు తెలిసింది.  ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్, అతని తల్లి కూడా కట్నం డిమాండ్ చేశారు. 

అతని కుటుంబం రూ.14 లక్షల కట్నం డిమాండ్ చేసింది. దీనికి ఒప్పుకున్నాం. దాంతో అమిత్ తో నా వివాహం ఆగస్ట్ 2021కి నిర్ణయించారు. కానీ కట్నం కోసం అమిత్ పెళ్లిని వాయిదా వేయడమే కాకుండా, కట్నంగా రూ.19లక్షలు ఇవ్వాలని కోరుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  దీంతో ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలపడంతో.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని ఫిరోజాబాద్  రూరల్ ఎస్పీ రణ్ విజయ్ సింగ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios