Asianet News TeluguAsianet News Telugu

తాగడంలో తగ్గేదేలే.. తెలంగాణలో నిన్న ఒక్క రోజే ఎంత తాగారో తెలుసా .. ?

శుక్రవారం మందు బాబులు రికార్డ్  నెలకొల్పారు. ఒకే రోజులో రూ.171 కోట్ల మద్యం అమ్ముడుపోయిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఏడాది మొత్తంలో జరగని అమ్మకాలు ఈ డిసెంబర్ నెలలోనే జరిగాయని అధికారులు తెలిపారు. 

Do you know how much you drank in one day in Telangana yesterday ..?
Author
Hyderabad, First Published Jan 1, 2022, 3:58 PM IST

నిన్న డిసెంబ‌ర్ 31. ఏడాదికి చివ‌రి రోజు. 2021 సంవ‌త్స‌రానికి ముగింపు రోజు. ప్ర‌తీ ఏడాది డిసెంబ‌ర్ 31 అంటే అంద‌రికీ స్పెష‌ల్‌. ఆ ఏడాదిలో జ‌రిగిన చెడు విష‌యాలు మ‌ర్చిపోవ‌డానికి, మంచి విష‌యాలు నెమ‌రు వేసుకోవానికి ప్ర‌తీ ఒక్క‌రూ ఆ రోజు పార్టీ చేసుకుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొంటారు. రాజ‌కీయ నాయ‌కుల ద‌గ్గ‌రి నుంచి, అతి సామాన్య వ్య‌క్తి వ‌ర‌కు అంద‌రూ డిసెంబ‌ర్ 31ను ఎంజాయ్ చేస్తారు. ఈ క‌ల్చ‌ర్ గ‌త ప‌దేహేనేళ్ల నుంచి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. 

ముగ్గురు మాజీ సీఎంల గృహ నిర్బంధం.. ఆందోళనలను అడ్డుకోవడానికి బలగాల చర్యలు

పార్టీ అంటే క‌చ్చితంగా మందు ఉండాల్సిందే అనే ప‌రిస్థితులు వ‌చ్చాయి. మందు లేకుండా చేసుకునే పార్టీలు చాలా త‌క్కువ అయిపోయాయి. ఇప్పుడు ఏ సెల‌బ్రేష‌న్స్ అయినా మందుతోనే ముడిప‌డి ఉన్నాయి అందుకే మ‌ద్యం గిరాకీ కూడా బాగా పెరిగిపోతోంది. ప్ర‌తీ ఏటా మ‌ద్యం అమ్మ‌కాల్లో జోరు క‌నిపిస్తోంది. శుక్ర‌వారం కూడా అదే జోరు క‌నిపించింది. క‌రోనా ఆంక్ష‌ల కార‌ణంగా మ‌ద్యం అమ్మ‌కాల‌కు కొంత స‌మ‌యం వ‌రకే అనుమ‌తి ఇచ్చినా.. త‌రువాత దానిని పొడ‌గించారు. దీంతో నిన్న ఏ బార్ లో చూసిన మందు బాబుల హ‌డావిడి కనిపించింది. బార్ అండ్ రెస్టారెంట్లు క‌ళ‌క‌ళ‌లాడిపోయాయి. ఏడాది మొత్తం రోజుల్లో ఏ రోజు జ‌ర‌గ‌ని నిన్న ఒక్క రోజే జ‌రిగాయి. కేవ‌లం శుక్ర‌వారం ఒక్క రోజు రూ.171 కోట్ల మందు అమ్ముడుపోయింద‌ని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 

ఐదు నెల‌ల్లో 902 కోట్లు...
ఈ ఏడాది జ‌రిగిన మ‌ద్యం అమ్మ‌కాల వివ‌రాల‌ను ఎక్సైజ్ శాఖ విడుద‌ల చేసింది. మొత్త ఏడాదిలో జ‌రిగిన అమ్మ‌కాల కంటే గ‌డిచిన ఐదు నెల‌ల్లోనే ఎక్కువ‌గా అమ్మకాలు జ‌రిగాయ‌ని తెలిపింది. గ‌డిచిన అన్ని నెల‌ల్లో కంటే డిసెంబ‌ర్ లోనే 3,435 కోట్ల లిక్క‌ర్ సేల్ జ‌రిగింద‌ని పేర్కొంది. గ‌తేడాది చివ‌రి నెల‌లో 2,764 కోట్ల సేలింగ్ జ‌రిగింది. గ‌తేడాది మొత్తం 25,602 కోట్ల మందు అమ్ముడుపోయింద‌ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే  ఏడాది శుక్ర‌వారం నాటికి క‌లుపుకొని 30,196 కోట్ల విలువైన మందు అమ్ముడుపోయింది. అయితే ఈ అమ్మ‌కాలు కూడా హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ఉన్న జిల్లాలో అధికంగా ఉంది.

దేశానికి పెద్ద సమస్య కాంగ్రెస్సే.. సోనియా అడ్డాలో యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

ఈ ఏడాది కొత్త మండ‌లాల్లో వైన్స్‌.. 
ఈ ఏడాది తెలంగాణ‌లో వైన్స్ ల సంఖ్య చాలా పెరిగింది. కొత్త మండ‌లాల్లోనూ ఈ సారి వైన్స్ ఓపెన్ చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. 2016 సంవ‌త్స‌రంలో తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌ను, కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేసింది. రెండేళ్ల‌కు ఒక సారి ప్ర‌భుత్వం మ‌ద్యం పాల‌సీని తీసుకొస్తుంది. అయితే కొత్త‌గా వచ్చిన మ‌ద్యం పాల‌సీ ప్ర‌కారం ప్ర‌తీ మండ‌లానికి ఒక వైన్స్ ఉండాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. అందులో భాగంగా కొత్త‌గా ఏర్పాటైన మండ‌లాల్లోనూ వైన్స్ ఓపెన్ చేయ‌డానికి అనుమ‌తి ఇచ్చింది. దీంతో నవంబ‌ర్ లో వైన్స్ ల‌కు టెండ‌ర్లు పిలిచింది. అదే నెల చివ‌ర్లో ల‌క్కీ డ్రా నిర్వ‌హిచింది. ల‌క్కీ డ్రాలో వైన్స్ సొంతం చేసుకున్న వారికి డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచి మ‌ద్యం అమ్ముకోవ‌చ్చ‌ని అనుమ‌తి ఇచ్చింది. ఇలా కొత్త‌గా వైన్స్ కు అనుమతి ఇవ్వ‌డం వ‌ల్ల అమ్మ‌కాలు పెరిగాయ‌ని అధికారులు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios