ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (up assembly elections 2022) సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీపై (congress) యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) మండిపడ్డారు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (up assembly elections 2022) సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీపై (congress) యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) మండిపడ్డారు. దేశానికి అతిపెద్ద సమస్య కాంగ్రెస్ (congress) పార్టీనే అంటూ వ్యాఖ్యానించారు. అవినీతి, అరాచకాలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని యోగి విమర్శించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో (raebareli) శనివారం బీజేపీ నిర్వహించిన జన విశ్వాస్ యాత్ర సభలో (jan vishwas yatra) ప్రసంగించిన ఆయన.. రాయ్ బరేలీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. 

కొన్ని రోజుల్లో రాయ్ బరేలీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని సీఎం జోస్యం పలికారు. రాయ్ బరేలీ లోక్‌సభ స్థానానికి సోనియాగాంధీ (sonia gandhi) ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీపై కూడా యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఏదైనా వాహనంపై ఆ పార్టీకి చెందిన జెండా ఉందంటే... అందులో ఆ పార్టీకి చెందిన ఒక గూండా కూర్చున్నాడంటూ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

up assembly elections 2022: విద్యార్థుల‌కు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్‌లు !

కాగా.. up assembly elections 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఎలాగైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని ప్ర‌ధాన పార్టీల‌న్ని ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ముమ్మ‌రం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు తాము అధికారంలోకి వస్తే తీసుకురాబోయేప‌థ‌కాలు, హామీలు గురించి చెబుతూ ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నాయి. 

అయితే, రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని బీజేపీ నేత‌, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. 350 కి పైగా స్థానాలు గెలుచుకుంటామ‌ని చెబుతున్నారు. మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ స‌ర్కారు ఎన్నిక‌ల ప్రణాళిక‌ల‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలోనే సీఎం యోగి ఆధిత్య‌నాథ్ విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. సుమారు 4700 కోట్ల రూపాయ‌ల విలువైన ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను విద్యార్థుల‌కు ఉచితంగా అందిస్తామ‌ని తెలిపారు. మొత్తం 6.8 మిలియ‌న్ల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అందిస్తామని యోగి స‌ర్కారు తెలిపింది.