Asianet News TeluguAsianet News Telugu

ఫాం హౌస్ సీఎం మనకు అవసరమా..అంటూ తెలుగులో స్పీచ్ అదరగొట్టిన ప్రధాని...

తెలంగాణ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ బీజేపీ సర్కార్ అంటూ నినాదాలు చేశారు.

Do we need Farm House CM? Prime Minister gave a speech in Telugu. - bsb
Author
First Published Nov 27, 2023, 1:30 PM IST

మహబూబాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ మహబూబాబాద్ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయన్నారు. తెలంగాణకు తరువాతి ముఖ్యమంత్రి బీజేపీనుంచేనని.. బీసీ వ్యక్తినే బీజేపీ ముఖ్యమంత్రిగా చేస్తుందని తెలిపారు. నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒక జబ్బును వదిలించుకుని మరో రోగాన్ని తగిలించుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. 

ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు. ఈ రోజుతో తెలంగాణలో తన మూడు రోజుల పర్యటన ముగుస్తుంది అని చెప్పుకొచ్చారు. 

కేసీఆర్ కు బీజేపీ సత్తా ముందే తెలిసి, నన్ను కలిసి నాతో చేతులు కలపడానికి ప్రాదేయపడ్డారు. కానీ మేము అందుకు వ్యతిరేకించాం. కేసీఆర్ అభ్యర్థనను ఎప్పుడైతే తిరస్కరించామో.. అప్పటినుంచి నన్ను తిట్టడం మొదలు పెట్టింది. ఏ చిన్న అవకాశం దొరికినా నన్ను తిడుతోంది. 

‘మోదీ గ్యారంటీ అంటే.. గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ..’ అంటూ తెలుగులో చెప్పడంతో సభలో ఒక్కసారిగా హర్షద్వానాలు చెలరేగాయి. 

‘తెలంగాణకు అలాంటి ఫార్మ్ హౌస్ సీఎం అవసరమా..’ అంటూ మధ్యలో తెలుగులో మరో చురక అంటించారు. 

బీఆర్ఎస్ నాలుగు చక్రాలు, ఓ స్టీరింగ్.. కాంగ్రెస్ హస్తం రెండూ ఒకటే.. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయన్నారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతోందన్నారు. కుంభకోణాలకు పాల్పడ్డవారికి ఎవ్వరినీ ఉపేక్షించమన్నారు. 

అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అవినీతిని బట్టబయలు చేస్తామన్నారు. నీటి ప్రాజెక్టుల్లో చేసిన అవినీతిని, డబుల్ బెడ్రూం ఇళ్లనిర్మాణంలో జరిగిన అవినీతిని, భూకుంభకోణాలను బద్దలు కొడతామన్నారు. 

‘నీళ్లు, నియామకాలు, నిధులు’.. ఇస్తానన్నాడు. కానీ.. ‘కన్నీళ్లు’ ఇచ్చాడు, మోసాలు ఇచ్చాడు అంటూ స్పీచ్ లో మధ్య మధ్యలో తెలుగులో మాట్లాడారు. ప్రతీ కోనా ఒకటే గానా.. బీజేపీ పర్ తెలంగాణా అంటూ తెలుగును మిక్స్ చేసి మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios