తెలంగాణ సర్కారుపై డికె అరుణ ఆగ్రహం

తెలంగాణ సర్కారుపై డికె అరుణ ఆగ్రహం

సంగాల చేర్వు నీటిని రబీ సాగుకు విడుదల చేశారు ఎమ్మెల్యే డికె అరుణ. సంగాల చేర్వు కు నీటిని వదలడంతో స్థానిక రైతులు అనందం వ్యక్తం చేశారు.

సంగాల చేర్వు గద్వాల మండలానికి గ్రౌండ్ వాటర్ పెరగటానికి ఎంతో ఉపయోగం అవుతుందన్నారు డికె అరుణ. నెట్టంపాడు ప్రాజెక్ట్ తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పనులను పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

సంగాల చేర్వు టూరిజం, ట్యాంక్ బండ్  ఏర్పాటుకు ఎమ్మెల్యేగా రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అన్ని చోట్ల ట్యాంక్ బండ్ పనులకు టెండర్లు పిలిచి పనులను మొదలు పెట్టడం  జరిగిందన్నారు.

ఇక్కడ మాత్రం నిదులు వచ్చినప్పటికీ  రాజకీయ దురుద్దేశం తో  టెండర్లు పిలవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా టెండర్లు పిలిచి పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో పిసిసి కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, విక్రమసింహారెడ్డి , అయ్యపు రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసి తదతరులు ఉన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page