Asianet News TeluguAsianet News Telugu

రిజర్వాయర్ల నుండి నీటిని వదలండి : డికె అరుణ

  • వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి
  • వెంటనే రిజర్వాయర్ల నుంచి నీటిని వదలాలి
  • జూరాల నీటిని ఎత్తిపోయడం దుర్మార్గం
dk aruna demands Release water from reservoirs

 

ర్యాలంపాడు, గుడెందొడ్డి రిజర్వాయర్ల నుండి వెంటనే నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని మాజీ మంత్రి , ఎమ్యెల్యే డి.కె.అరుణ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం గుడెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లకు పరిశిలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్లో ఒక టీఎంసీకి పైగా నీరు ఉన్నాయని.. అదేవిధంగా గుడెందొడ్డి రిజర్వాయర్లో కూడా నీరు నిల్వ ఉన్నదని, వెంటనే రైతులకు నీటిని విడుదల చేయాలన్నారు. రెండు రిజర్వాయర్ల కింద పెద్ద ఎత్తున రైతులు పంటలు సాగుచేస్తున్నారని, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, నీరు విడుదల చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారన్నారు.

అధికారులు వెంటనే నీటిని విడుదల చేస్తే రైతుల పంటలు కాపాడిన వారమవుతామన్నారు. ఈ విషయంపై పిజెపి ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఉన్న నీటిని పగడ్బందీగా వాడుకుని నీటిని విడుదల చేస్తే పంటలు ఎండిపోకుండా కాపాడవచ్చన్నారు. ఈ విషయంపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జూరాల నుండి దుండుదుకుగా నీటిని ఎత్తి పోయడం ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు.

జూరాల ఆయాకట్టుకే నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని ఆమె వాపోయారు. ఇప్పటికైనా ఉన్న నీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని రైతులకు నీటి విడుదల చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి , పటేల్ ప్రభాకర్ రెడ్డి, బండల వెంకట్రాములు, నాగేందర్ రెడ్డి, రామచంద్రా రెడ్డి తదితరులు ఉన్నారు.

 

మరిన్ని తాజా తాజా వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios