Asianet News TeluguAsianet News Telugu

దిశ నిందితుల మృతదేహాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ హైకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల మృతదేహాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

disha murder case: save the accused dead bodies says telangana high court
Author
Hyderabad, First Published Dec 13, 2019, 6:14 PM IST

తెలంగాణ హైకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల మృతదేహాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

జాతీయ మానవ హక్కుల కమీషన్ మళ్లీ నిందితుల మృతదేహాలను రీ పోస్ట్‌మార్టం కోరవచ్చని.. అప్పటి వరకు డెడ్ బాడీలను భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ముగ్గురితో సుప్రీం కమిటీ

చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ జరిగిన అనంతరం నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించగా... సుప్రీం ఆదేశాలతో మృతదేహాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీలో ముగ్గురు రిటైర్డ్ జడ్జిలను నియమిస్తూ సుప్రీంకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

ఆరు నెలల్లో ఈ కమిటీ విచారణను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది.జాతీయ మానవ హక్కుల సంఘం విచారణతో పాటు, తెలంగాణ హైకోర్టు విచారణను కూడ సుప్రీంకోర్టు నిలిపివేసినట్టుగా సమాచారం.

విచారణపై కమిటీ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్  వీఎస్ సిర్పుర్కార్ ఛైర్మెన్‌గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా రేఖ, మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు ఈ కమిటీకి సీఆర్‌పీఎఫ్ భద్రత ఉంటుందని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ కమిటీ విచారణకు సంబంధించి మీడియా కవరేజ్ ఉండకూడదని కూడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.   ఆరు మాసాల్లో ఈ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేసింది.

బుధవారం నాడు ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. రెండో రోజున విచారణను ప్రారంభించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వాన్ని వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టులో వాదించారు.

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై  సుప్రీంకోర్టు తలుపు ఎందుకు తట్టారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పిటిషనర్ జిఎస్ మణిని అడిగారు. ఈ ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా మణి తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు  వివరించారు. ఈ ఎన్‌కౌంటర్ విషయంలో వాస్తవాలను తెలుసుకొనేందుకు కోర్టును ఆశ్రయించినట్టుగా ఆయన తెలిపారు.

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వివరణ ఇచ్చారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల నుండి  రివాల్వర్ నుండి  తీసుకొని  కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్టుగా రోహిత్గి చెప్పారు.

Also Read:దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: సుప్రీం కమిటీ సభ్యుల నేపథ్యం ఇదే...

నలుగురు నిందితులు పోలీసుల నుండి తీసుకొన్న రివాల్వర్ తో కాల్పులు జరిపారా అని తెలంగాణ ప్రభుత్వ లాయర్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.  నలుగురు నిందితులు దాడి చేశారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

నిందితులు కాల్పులు జరిపిన సమయంలో  పోలీసులకు ఒక్క బుల్లెట్ కూడ తగల్లేదని రోహిత్గి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదని చీప్ జస్టిస్ బాబ్డే అభిప్రాయపడ్డారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios