దిశ నిందితుల ఎన్‌కౌంటర్: ముగ్గురితో సుప్రీం కమిటీ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై గురువారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేసింది.ఈ విచారణ సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు రిటైర్డ్ జడ్జిలను నియమిస్తూ సుప్రీంకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లో ఈ కమిటీ విచారణను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది.జాతీయ మానవ హక్కుల సంఘం విచారణతో పాటు, తెలంగాణ హైకోర్టు విచారణను కూడ సుప్రీంకోర్టు నిలిపివేసినట్టుగా సమాచారం.
విచారణపై కమిటీ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ వీఎస్ సిర్పుర్కార్ ఛైర్మెన్‌గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా రేఖ, మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు ఈ కమిటీకి సీఆర్‌పీఎఫ్ భద్రత ఉంటుందని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కమిటీ విచారణకు సంబంధించి మీడియా కవరేజ్ ఉండకూడదని కూడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు మాసాల్లో ఈ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Also read:ఆ మృతదేహం దిశదే: డిఎన్ఏ రిపోర్ట్ ఇదీ...
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర్య దర్యాప్తు చేయించాలని భావిస్తున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే తెలిపారు. ఈ నెల 6వ తేదీన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో గురువారం నాడు విచారణ ప్రారంభమైంది. గురువారం నాడు రెండోరోజున విచారణ ప్రారంభించింది సుప్రీంకోర్టు.
బుధవారం నాడు ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. రెండో రోజున విచారణను ప్రారంభించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వాన్ని వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టులో వాదించారు.
చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు తలుపు ఎందుకు తట్టారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పిటిషనర్ జిఎస్ మణిని అడిగారు. ఈ ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా మణి తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ ఎన్‌కౌంటర్ విషయంలో వాస్తవాలను తెలుసుకొనేందుకు కోర్టును ఆశ్రయించినట్టుగా ఆయన తెలిపారు.
చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వివరణ ఇచ్చారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల నుండి రివాల్వర్ నుండి తీసుకొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్టుగా రోహిత్గి చెప్పారు.
నలుగురు నిందితులు పోలీసుల నుండి తీసుకొన్న రివాల్వర్ తో కాల్పులు జరిపారా అని తెలంగాణ ప్రభుత్వ లాయర్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. నలుగురు నిందితులు దాడి చేశారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
నిందితులు కాల్పులు జరిపిన సమయంలో పోలీసులకు ఒక్క బుల్లెట్ కూడ తగల్లేదని రోహిత్గి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదని చీప్ జస్టిస్ బాబ్డే అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై స్వతంత్ర దర్యాప్తుతో చేయించాలని తాము భావిస్తున్నామని తెలంగాన రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్‌కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రోహిత్గికి తెలిపారు. పోలీసుల నుండి నిందితులు రివాల్వర్‌ను లాక్కొని కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్ తో దర్యాప్తు చేయిస్తున్న విషయాన్ని రోహిత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణను చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.మరో వైపు ఈ ఎన్‌కౌంటర్ బూటకమని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడ ఏం జరిగిందనే విషయాలు ఎవరికీ తెలియవని చీప్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.