దిశ కేసు: ఈ నెల 27న ఛార్జీషీటు దాఖలు చేయనున్న పోలీసులు
సైబరాబాద్ పోలీసులు దిశ హత్య కేసులో ఈ నెల 27వ తేదీన ఛార్జీషీట్‌ను దాఖలు చేయాలని యోచిస్తున్నారు.
హైదరాబాద్: దిశపై గ్యాంగ్‌రేప్ హత్య కేసు విచారణను పోలీసులు పూర్తి చేశారు. ఈ నెల 27వ తేదీన పోలీసులు షాద్‌నగర్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.
గత నెల 27వ తేదీన దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులు ఆపై ఆమెను హత్య చేశారు. ఈ కేసు రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లి సమీపంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఈ నెల 27వ తేదీన షాద్‌నగర్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే షాద్‌నగర్ పోలీసులు 30 మంది సాక్షులను చేర్చారు.
దిశపై గ్యాంగ్‌రేప్, హత్య తదితర ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కీలకమైన సాక్ష్యాలను సేకరించారు. ఈ సాక్ష్యాలను కూడ సైబరాబాద్ పోలీసులు జాతీయ మానవహక్కుల సంఘానికి కూడ సమర్పించారు.
దిశ నిందితుల గ్యాంగ్‌రేప్ నిందితుల ఎన్‌కౌంటర్ విషయమై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వచ్చే వారంలో విచారణకు తెలంగాణ రాష్ట్రానికి రానుంది.
Also read: కుళ్లిన స్థితిలోకి దిశ నిందితుల మృతదేహాలు: ఎంబామింగ్‌పై వైద్యుల తర్జనభర్జన
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందక ముందు నిందితులు ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దిశపై గ్యాంగ్ రేప్, హత్య కేసు ఉదంతానికి సంబంధించి సేకరించిన సమాచారాన్ని కూడ పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపర్చారు.
దిశ మృతదేహాన్ని తొలుత చూసిన సత్యం నుండి సేకరించిన సమాచారం కూడ రిపోర్టులో పొందుపర్చనున్నారు. తొలుత సంఘటన స్థలానికి చేరుకొన్న కానిస్టేబుల్ హనుమంతు, దిశ కుటుంబసభ్యుల నుండి సేకరించిన సమాచారాన్ని కూడ రిపోర్టులో పొందుపర్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.