దిశ నిందితుల ఎన్ కౌంటర్: వైఎస్ఆర్ గుర్తొచ్చారన్న వాసిరెడ్డి పద్మ

దిశ రేప్, హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మహిళల పక్షాన ఎన్ కౌంటర్ ను స్వాగతిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. 

Disha case accused encounter: Ap woman commission chairperson vasireddy padma reacts on encounter

అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య ఘటన కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో తెలంగాణ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. 

దిశ రేప్, హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మహిళల పక్షాన ఎన్ కౌంటర్ ను స్వాగతిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. 

దిశకు సత్వర న్యాయం జరిగిందంటూ దోషులకు పడిన శిక్షను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వచ్చారని చెప్పుకొచ్చారు. వైయస్ఆర్ హయాంలో జరిగిన ఎన్ కౌంటర్ మరొకసారి గుర్తుకు వచ్చిందని ఆమె వెల్లడించారు. 

Disha accused encounter: దేశవ్యాప్తంగా సంబరాలు, దిశ కాలనీలో......

స్త్రీలపై జరుగుతున్న పాశవిక దాడులకు ప్రతిగా ఈ ఎన్‌కౌంటర్‌ కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. నిందితులకు పడిన శిక్ష పట్ల దేశ ప్రజలు హర్షిస్తున్నారనీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. 

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

అప్పుడు వైఎస్ఆర్...ఇప్పుడు కేసీఆర్.. ఇద్దరు చేసిందీ ఒకటే.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios