Asianet News TeluguAsianet News Telugu

Disha accused encounter: దేశవ్యాప్తంగా సంబరాలు, దిశ కాలనీలో...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై దిశ నివాసం వద్ద సంబరాలు నెలకొన్నాయి. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. 
 

disha accused encounter: Disha colony people celebrate and cheer
Author
Hyderabad, First Published Dec 6, 2019, 12:19 PM IST

శంషాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై దిశ నివాసం వద్ద సంబరాలు నెలకొన్నాయి. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ అని తెలియగానే కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు అభినందనలు తెలిపారు. పోలీసులు జిందాబాద్ అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

ఈ సందర్భంగా బాధితురాలు దిశను గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా దిశ ఫ్యామిలీ తమ కాలనీలో నివాసం ఉంటుందని అయితే వారు అందరితో కలిసిమెలిసి ఉంటారని ఆ ఫ్యామిలీకి మంచి పేరుందని కాలనీ వాసులు చెప్తున్నారు. 

వారికి భగవంతుడు ఇంతటి కడుపుకోత ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. బిడ్డను కోల్పోయిన బాధ శాశ్వతంగా పోనప్పటికీ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో కాస్త న్యాయం చేసినట్లు జరిగిందని కాలనీ వాసులు చెప్పుకొస్తున్నారు. 

DishaCaseAccusedEncounter : పోలీసులకు స్వీట్లు తినింపించిన దిశ ఇరుగుపొరుగు..

దిశ చాలా మంచి అమ్మాయి అని వారు ప్రశంసిస్తున్నారు. అమాయకంగా ఉండేదని ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడేదని అంతటి మంచి మనిషిని దారుణంగా హత్య చేసిన నిందితులకు ఎన్ కౌంటర్ సరైన శిక్ష అంటూ చెప్పుకొస్తున్నారు. 

నిందితులకు ఉరిశిక్ష వేయాలని తాము డిమాండ్ చేశామని అందుకు మరింత సమయం పడుతుందని భావించామని అయితే పోలీసులపై నిందితులు తిరగబడటంతో వారిని ఎన్ కౌంటర్ చేయడం శుభపరిణామమన్నారు కాలనీ వాసులు. 

దిశ రేప్, హత్య ఘటన నేపథ్యంలో తాము పోలీసులపై కాస్త ఇబ్బందిగా మాట్లాడామని వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు కాలనీవాసులు. మెుత్తానికి నిందితులను ఎన్ కౌంటర్ చేయడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. 

మరోవైపు దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తోంది. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటు సంతోషం తెలుపుతున్నారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్: సరైనోడు మీరే సర్! కేటీఆర్ పై నెటిజన్ల ప్రశంసలు

అటు పలు కళాశాలల్లో విద్యార్థినులుసైతం సంబరాలు చేసుకుంటున్నారు. తము న్యాయం జరిగిందంటూ యువతులు నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి భారీగా జనాలు తరలి వచ్చారు. పోలీసులను పొగడ్తలతో ముంచెత్తతూ పూలవర్షం కురిపిస్తున్నారు. 

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

Disha Case Accused Encounter: సీపీ సజ్జనార్ పై అయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios