నారాయణపేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య తీవ్రగాయాల పాలయ్యాడు. జెక్లెర్ వద్ద బైక్‌పై వెళ్తున్న వారిని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ప్రస్తుతం ఆయన పరిస్ధితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. 

కాగా దిశపై అత్యాచారం, హత్య చేసిన నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య మైనర్ గా అధికారులు తేల్చారు. చెన్నకేశవులు ఆమెను ఏడాది క్రితం వివాహం చేసుకొన్నాడు. ప్రస్తుతం ఆమె ఆరుమాసాల గర్భవతి. చెన్నకేశవులు భార్య మైనర్ గా అధికారులు తొలుత అభిప్రాయపడ్డారు.

Also Read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే

ఈ మేరకు చెన్నకేశవులు భార్యకు సంబంధించిన ఆధారాలను ఐసీడీఎస్ అధికారులు సేకరించారు. గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు.

ఈ బాలికకు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటి నుండి బాబాయి. నాన్నమ్మ వద్ద ఆ బాలిక జీవిస్తోంది. అయితే ఆ సమయంలోనే ఆమె చెన్నకేశవులుతో ప్రేమలో పడింది.

ఈ విషయం స్థానికులకు తెలిసింది. గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. చెన్నకేశవులు ఆ బాలికను  వివాహం చేసుకొంటానని చెప్పాడు. చెన్నకేశవులు, మైనర్ బాలికను గుడిగండ్లకు సమీపంలోని దత్తాత్రేయ ఆశ్రమంలో ఏడాది క్రితం వివాహం చేసుకొన్నాడు.

Also Read:దిశ రేప్, హత్య: దారి మూసేసి, గుడారం వేసి కాపలా

వివాహమైన తర్వాత నుండి ఆ మైనర్ బాలిక చెన్నకేశవులు ఇంట్లోనే ఉంటుంది. బాలిక చదువుకొన్న స్కూల్ లో పుట్టినతేదీ రికార్డులను ఐసీడీఎస్ అధికారులు సేకరించారు.

ఆ బాలిక 2006 జూన్ 15వ తేదీన జన్మించినట్టుగా స్కూల్ రికార్డులు చెబుతున్నాయి. ఈ రికార్డుల ప్రకారంగా ఆమెకు ప్రస్తుతం 13 ఏళ్ల ఆరు నెలల వయస్సు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

Also Read:బిగ్ బ్రేకింగ్: దిశ నిందితుల కేసులో బయటకొస్తున్న సంచలన విషయాలు

ఈ బాలిక మైనర్ గా గుర్తించిన ఐసీడీఎస్ అధికారులు ఆమెను తమ సంరక్షణలో ఉంచుకొంటామని చెప్పారు. కానీ కుటుంబసభ్యులు అందుకు అంగీకరించలేదు.ఈ బాలికకు చెల్లెలు, తమ్ముడు కూడ ఉన్నారు. వారిద్దరూ కూడ బాబాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు.

వారిద్దరిని కూడ ఐసీడీఎస్ అధికారులు తమ సంరక్షణకు తీసుకెళ్తామని చెప్పారు. కానీ, బాలిక చెల్లెలును పంపడానికి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. బాలుడిని పంపేందుకు మాత్రం అంగీకరించారు. 

ఇదిలా ఉంటే దిశపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితుల్లో ముగ్గురు కూడ మైనర్లేననే ప్రచారం కూడ సాగింది. స్కూల్ రికార్డుల ప్రకారంగా ఈ ముగ్గురు మైనర్లేనని రికార్డులు చెబుతున్నాయి. కానీ, షాద్ నగర్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో నలుగురు కూడ మేజర్లేనని తేల్చి చెప్పింది.