హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య ఘటనలో నిందితుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశపై అఘాయిత్యానికి పాల్పడక ముందే అనేక ఘోరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. 

గతంలోనే నిందితులందరికీ నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు అయిన మహ్మద్ ఆరిఫ్ మరో నిందితుడు చెన్నకేశవులతో కలిసి ఈ దారుణాలకు పాల్పడినట్లు సమాచారం. 

ఇప్పటి వరకు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు ఇద్దరూ కలిసి తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కర్ణాటక హైవేలపై జరిగిన దాడుల కేసులను పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. 

దిశ రేప్, హత్య: దారి మూసేసి, గుడారం వేసి కాపలా...

దిశను రేప్ చేసి అనంతరం పెట్రోల్ పోసి ఎలా అయితే సజీవ దహనం చేశారో అదే రీతిలో హైవేలపై 15 కేసులు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ 15 కేసులు దిశను ఏ రీతిలో అయితే రేప్ చేసి హత్య చేశారో అలానే చేశారని పోలీసులు గుర్తించారు. 

ఇప్పటి వరకు తొమ్మిది మందిపై లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తొమ్మిది మందిని హత్య చేసిన వారిలో మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇకపోతే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిట్ బృందంతోపాటు, పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన నాలుగు బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

చార్జిషీట్ ఫైల్ చేసేలోపు ఈ హత్యలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని పోలీసుల బృందాలు ప్రయత్నిస్తున్నాయి. నిందితుల డీఎన్ఏ ఆధారంగా కేసులను చేధించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కుళ్లిపోతున్న దిశ నిందితుల మృతదేహాలు:చేతులెత్తేసిన వైద్యులు...