Asianet News TeluguAsianet News Telugu

గాంధీకి చేరుకొన్న దిశ నిందితుల కుటుంబాలు, ఒక్కొక్కరికి గంటన్నర టైమ్

దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం సోమవారం నాడు ప్రారంభమైంది. నిందితుల కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి చేరుకుొన్నారు. 

Disha accused families reaches at Gandhi hospital for re postmortem
Author
Hyderabad, First Published Dec 23, 2019, 11:09 AM IST | Last Updated Dec 23, 2019, 1:19 PM IST

హైదరాబాద్:దిశ నిందితుల కుటుంబసభ్యులు హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలకు రీ పోస్టు మార్టం సోమవారం నాడు ఉదయం ప్రారంభమైంది. రీ పోస్టుమార్టం పూర్తైన  తర్వాత నిందితుల  మృతదేహాలకు  కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.

also read:దిశ నిందితుల మృతదేహాలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం

సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపుగా రీపోస్టుమార్టం పూర్తి చేయాలని  తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి  తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్  నిపుణుల బృందం ఆధ్వర్యంలో నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం నాడు ఉదయం గాంధీ ఆసుపత్రిలో రీ పోస్టుమార్టం ప్రారంభమైంది.

Also read:దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్

ఒక్కో మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయడానికి సుమారు గంటన్నరకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన  నాలుగు మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించడానికి మధ్యాహ్నం మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే

దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం జరుగుతన్న సమయంలో ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీస్తున్నారు. ఈ రిపోర్టును కూడ హైకోర్టు రిజిష్ట్రార్‌కు అప్పగించనున్నారు. రీ పోస్టుమార్టం రిపోర్ట్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దిశ నిందితుల కుటుంబసభ్యులు కూడ గాంధీ ఆసుపత్రికి చేరుకొన్నారు. రీ పోస్టుమార్టం పూర్తైన తర్వాత  కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మృతి చెందారు. ఈ నలుగురు నిందితుల మృతదేహాలను  భద్రపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గాంధీ  ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపర్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios