జనగామ బీజేపీ నేత తిరుపతిరెడ్డి అదృశ్యం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై ఆరోపణలు చేస్తూ కుటుంబ సభ్యుల ఆందోళన
జనగామకు చెందిన బీజేపీ నాయకుడు తిరుపతి రెడ్డి అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఎం.తిరుపతిరెడ్డి కనిపించడం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదు చేశారు. అయితే అదృశ్యమైన తిరుపతి రెడ్డికి, బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరుడు కరుణాకర్ రెడ్డికి ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఈ కిడ్నాప్ వెనుక ఆయనే ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.
అమానవీయం.. గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన..యూపీలో ఘటన, నిందితుల అరెస్టు
కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, తిరుపతి కుటుంబ సభ్యులు శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తిరుపతి రెడ్డి గురువారం మధ్యాహ్నం తన కారులో అల్వాల్ లోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తన ప్లాట్ ను పరిశీలించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం కరెంట్ బిల్లు తీసుకురావాలని డ్రైవర్ ను కోరాడని చెప్పారు. అయితే డ్రైవర్ ఆఫీసుకు తిరిగి వచ్చేసరికి తిరుపతి కనిపించలేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యిందని తెలిపారు.
వెంటనే డ్రైవర్ తమకు ఫోన్ చేసి యజమాని ఇంటికి వచ్చాడా అని ఆరా తీశారని చెప్పారు. కానీ ఆయన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందుతూ తాము అంతా అల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నామని అన్నారు. కుషాయిగూడలోని నాగార్జున కాలనీలోని తన నివాసం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి తిరుపతి అక్కడి నుంచి బయలుదేరినట్లు బంధువు ఒకరు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి.. ఇనుప రాడ్లతో కొట్టిన దుండగులు
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తిరుపతి ఆటో ఎక్కుతున్న దృశ్యాలు కనిపించడంతో ఇది కిడ్నాప్ కేసునా కాదా అనేది తెలియడం లేదని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఆటో ఘట్ కేసర్ వైపు వెళ్లిందని పోలీసులు తెలిపారు. తిరుపతి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కాగా.. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మైనంపల్లి స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మీడియాతో అన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనకు తిరుపతి తెలియదని, ఆయనను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు.