Asianet News TeluguAsianet News Telugu

ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లపై యోచన

 విద్యుత్ వినియోగం విషయంలో తెలంగాణా ప్రభుత్వం ప్రీ పెయిడ్, పోస్టుపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రవేశ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల విద్యుత్ వృధాను అరికట్టటమే కాకుండా పొదుపు కూడా అవుతుందని ప్రభుత్వంభావిస్తోంది.

digital meters

 విద్యుత్ వినియోగం విషయంలో తెలంగాణా ప్రభుత్వం ప్రీ పెయిడ్, పోస్టుపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రవేశ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల విద్యుత్ వృధాను అరికట్టటమే కాకుండా పొదుపు కూడా అవుతుందని ప్రభుత్వంభావిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ విధానాలున్నట్లే విద్యుత్ మీటర్ల విషయంలో కూదా అదే విధానాన్ని ప్రవేశపెడితే ఎలాగుంటుందని చర్చ జరిగినట్లు సమాచారం.

  ఈ పద్దతిలో ప్రతీ ఇంటికీ స్ధూలంగా ఎంత విద్యుత్ వినియోగం అవుతున్నదో గతంలోని బిల్లుల ఆధారంగా సగటు నిర్ణయిస్తారు. ఆ సగటును యూనిట్ ఛార్జ్ ప్రకారం ఎంత డబ్బులు చెల్లించాలన్నది విద్యుత్ శాఖ నిర్ణయిస్తుంది. అపుడు సదరు మొత్తాన్ని వినియోగదారుడు ప్రీ పెయిడ్ ద్వరా గానీ లేక పోస్ట్ పెయిడ్ ద్వరా గానీ అందుకోవచ్చు. ప్రీ పెయిడ్ అయితే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్న పద్దతిలోనే ముందుగా డబ్బులు వేసి రీ ఛార్జ్ చేసుకోవాలి.

 ఎంత మొత్తానికి రీ ఛార్జ్ చేసుకున్నారన్న దాన్ని బట్టి విద్యుత్ ఎన్ని రోజులు వాడుకోవాలన్నది లెక్క. అయితే, ఒకవేళ ఎక్కువ విద్యుత్ ను వాడుకున్నా నష్టం ఏమీ లేదు. ఎందుకంటే, విద్యుత్ ఎప్పుడైపోతే అప్పుడే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు.

అదే విధంగా పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు కూడా పనిచేస్తాయి. ప్రతీనెలా అడ్వన్సుగా ఒక బిల్లు డబ్బులు ముందే తీసుకుంటారు కాబట్టి మొబైల్ బిల్లు కట్టుకున్నప ద్దతిలోనే నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లిస్తే విద్యుత్ సరఫరా జరుగుతూనే ఉంటుంది. పై రెండు పద్దతుల్లోనూ వినియోగదారుడు ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే వెంటనే విద్యతు సరఫరా ఆగిపోతుంది.

  ఈ ప్రయోగాన్ని ప్రభుత్వం ముందుగా ప్రీపెయిడ్ మీటర్లు ప్రవేశపెట్టటం ద్వరా చేద్దామనుకుంటున్నది. అందుకోసం ప్రభుత్వ కార్యాలయాలను ప్రయోగానికి ఎంచుకుంటున్నది. ఇందుకోసం సుమారు 26 వేల ప్రీపెయిడ్ మీటర్ల కొనుగోలుకు నిర్ణయమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే వెంటనే పోస్టుపెయిడ్ విద్యుత్ మీటర్లను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ విధానాన్ని ఎప్పటి నుండి ప్రవేశపెట్టాలన్న విషయమే ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios