మన టివి ద్వారా ప్రసారాలు ప్రారంభం సద్వినియోగం చేసుకోవలన్న మంత్రులు కడియం, కేటీఆర్

తెలంగాణలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థుల కోసం డిజిటల్‌ తరగతులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2700 స్కూల్లో వివిధ దశల్లో తరగతులు ప్రారంభం కానుండగా.. మన టీవీ ద్వారా మొదటి దశలో 1500 పాఠశాలల్లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. టీఎస్‌-క్లాస్‌ కార్యక్రమాన్ని మన టీవీ స్టుడియోలో మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్‌ సంయుక్తంగా ప్రారంభించారు.

రోజూ ఉదయం రూ.1030 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు, మధ్యాహ్నం 2-4 గంటల మధ్య తరగతులు ప్రసారమవుతాయని మన టీవీ సీఈఓ శైలేష్‌రెడ్డి తెలిపారు.శాస్త్ర, సాంకేతిక సహాయంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకే డిజిటల్‌ తరగతులు ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సామాన్య ప్రజలకు ఉపయోగపడని సాంకేతిక నిష్ఫలమని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ‘మన టీవీ’ మరింత చేరువ కావడంలో కేబుల్‌ ఆపరేటర్లదే ప్రముఖ పాత్రని అన్నారు