హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ మైనర్ బాలిక ప్రేమోన్మాదానికి బలైన విషయం తెలిసిందే. తనను పట్టించుకోక పోవడంతో సొంత ప్రియుడే ఆమెను బ్లేడ్ తో గొంతుకోసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ హత్యకు గల కారణాలను వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంబర్ నగర్ లో నివాసముండే అనూష(16), పార్శిగుట్ట నివాసి వెంకట్ (19) పదో తరగతిలో స్నేహితులు. అయితే వీరి స్నేహం కాస్తా ఇంటర్మీడియట్ లో బలపడి ప్రేమగా మారింది. దీంతో నారాయణగూడ లో వేరు వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటికి ఒకే బస్ లో ప్రయాణించేవారు. సోషల్ మీడియా, ఫోన్ ద్వారా ఎప్పుడూ టచ్ లో ఉండేవారు. 

అయితే గత కొంత కాలంగా వెంకట్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనూష గుర్తించింది. దీంతో అతడితో నెల రోజులుగా మాట్లాడకుండా దూరంగా ఉంటోంది. అతడి ఫోన్ నంబర్ ను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. దీంతో ఆమెతో మాట్లాడేందుకు వెంకట్ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో ఇక లాభం లేదని ఆమె నివాసముండే ప్రాంతానికే నేరుగా వెళ్లాడు.

అక్కడ అనూషను ఆమె స్నేహితురాలి సాయంతో పిలిపించుకున్నాడు. అక్కడి నుండి ఆమెను ఓ స్కూటీపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజ్ రైల్వే స్టేషన్ సమీపంలోని క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి ఇద్దరి మధ్యా కాస్సేపు వాగ్వివాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన వెంకట్ తనతో తెచ్చుకున్న బ్లేడ్ తో అనూష గొంతు కోశాడు. దీంతో అనూష గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న యువకులు వచచి చూడగా అనూష రక్తపు మడుగులో పడివుంది. దీంతో వారె వెంకట్ ను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. నిందితుడు వెంకట్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా  హత్య చేయడానికి గల కారణాలను బైటపెట్టాడు. ఈ ఘటనపై మరింత సమాచారం సేకరించి నిందితుడిని కఠినంగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.


 

సంబంధిత వార్తలకోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

అనూష హత్య కేసులో ట్విస్ట్: మరో అమ్మాయితో ప్రేమోన్మాదికి అఫైర్

ప్రేమోద్మానికి మరో యువతి బలి... బ్లేడ్‌తో యువతి గొంతు కోసి హత్య