అనూష హత్య కేసులో ట్విస్ట్: మరో అమ్మాయితో ప్రేమోన్మాదికి అఫైర్

Twist in Anusha's murder case
Highlights

అనూష హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అనూష అనే అమ్మాయిని వెంకటేష్ అనే ప్రేమోన్మాది హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హత్య చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: అనూష హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అనూష అనే అమ్మాయిని వెంకటేష్ అనే ప్రేమోన్మాది హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హత్య చేసిన విషయం తెలిసిందే.

వెంకటేష్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వెంకటేష్ మరో అమ్మాయితో అఫైర్ నడుపుతుండడంతో అనూష అతనికి దూరం జరిగినట్లు తెలుస్తోంది. ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఆ విషయం అనూషకు తెలిసిందని అంటున్నారు.

దాంతో గత పది రోజులుగా అనూష వెంకటేష్ కు దూరంగా ఉంటూ వస్తోంది. దాంతో కక్ష పెంచుకున్న వెంకటేష్ శ్రేయ అనే మిత్రురాలి ద్వారా అనూషను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రప్పించినట్లు తెలుస్తోంది.

బ్లేడుతో కోసి చంపేస్తానని ఉస్మానియాకు వచ్చిన అనూషను వెంకటేష్ బెదిరించాడని చెబుతున్నారు. భయపడి అనూష తాను ప్రేమిస్తానని చెప్పింది. అయినా కూడా ప్రేమోన్మాది వెంకటేష్ అనూషను దారుణంగా హత్య చేశాడు. 

loader