Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ ప్రకటించని ఆ 19 స్థానాల మతలబేంటీ?

కాంగ్రెస్ పార్టీ తాజాగా 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. 100 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మరో 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఇందులో నాలుగు స్థానాలను వామపక్షాలకు కేటాయించనుంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. 
 

details about congress pending seats, seats for left pending kms
Author
First Published Oct 27, 2023, 9:41 PM IST

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది. పలు క్లిష్టమైన స్థానాల్లోనూ ఏఐసీసీ తుది నిర్ణయం తీర్చుకుంది. తొలి జాబితా 55 మంది అభ్యర్థులతో విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్టయింది. ఇంకా 19 స్థానాలపై కాంగ్రెస్ పార్టీ తేల్చాల్సి ఉన్నది.

కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించిన 19 అసెంబ్లీ స్థానాలు ఇవే..

1. వైరా, 2. కొత్తగూడెం, 3. చెన్నూర్, 4. కొత్తగూడెం, 5. నిజామాబాద్ అర్బన్, 6. కామారెడ్డి, 7. చార్మినార్, 8. సిరిసిల్ల, 9. సూర్యపేట, 10. తుంగతుర్తి, 11. కరీంనగర్, 12. బాన్సువాడ, 13. జుక్కల్, 14. పఠాన్ చెరువు, 15. ఇల్లందు, 16. డోర్నకల్, 17. ఆశ్వారావుపేట, 18. నారాయణ్ ఖేడ్, 19. సత్తుపల్లి.

వామపక్షాలకు..

ఇందులో నాలుగు స్థానాలు వామపక్షాలకు కేటాయించాల్సి ఉన్నది. కొత్తగూడెం, చెన్నూర్ స్థానాలను సీపీఐకి కేటాయించినట్టు తెలిసింది. సీపీఎంకు రెండు స్థానాలపై ఇంకా చర్చ జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మంలో వామపక్షాలకు బలమైన మద్దతు ఉంటుంది. ఖమ్మంలో సీపీఐకి ఒక సీటు కేటాయించినట్టే సీపీఎంకు కూడా ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరినట్టు సమాచారం. వైరా, మిర్యాలగూడలను సీపీఎంకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీకి వైరాలోనూ బలమైన అభ్యర్థి ఉన్నందున ఆ స్థానాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆ స్థానానికి బదులు ఒక ఎమ్మెల్సీ సీటును ఇస్తామనే ప్రతిపాదనను సీపీఎం ముందు ఉంచినట్టు తెలిసింది. దీనిపై ఇంకా తేలాల్సి ఉన్నది. తొలుత పాలేరు సీటు కావాలని సీపీఎం పట్టుబట్టింది. కానీ, ఆ స్థానంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించేసింది.

Also Read: T Congress: రేపటి నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర షురూ.. వివరాలివే

సీఎం కేసీఆర్ టార్గెట్‌గా.. 

ఈ స్థానాలుపోను మరో 15 స్థానాలపై కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కేసీఆర్ పై బలమైన నేతను బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డిని బరిలోకి దింపే, గజ్వేల్‌లో కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోటీకి దింపే నిర్ణయాలను కాంగ్రెస్ తీసుకోవాల్సి ఉన్నది.

Also Read: పాలేరు స్థానంలో ఉత్కంఠ రాజకీయం.. హుజురాబాద్ బైపోల్ హీట్ రిపీట్?

టికెట్ ఫైట్..

అలాగే, తీవ్ర పోటీ, వివాదాలు ఉన్న స్థానాలను కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టింది. కాగా, కొన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అసంతృప్తుల్ని బుజ్జగించడానికీ వాటిని పెండింగ్‌లో పెట్టినట్టూ తెలుస్తున్నది. సూర్యపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డిల మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ ఉన్నది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, పిడమర్తి రవి సహా మరో ఇద్దరు నేతలు పోటీలో ఉన్నారు. నీలం మధు పార్టీలో చేరడంతో పటాన్ చెరు టికెట్, తీవ్రమైన వర్గపోరున్న నారాయణ్ ఖేడ్‌ టికెట్‌నూ కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. అయితే, మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన స్థానాల జాబితానూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios