విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇవాళ ఉదయం వరంగల్ లో సరదాగా గడిపారు. పట్టణంలోని ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వాకర్స్‌తో కలిసి మంత్రి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాలని మంత్రి వాకర్స్ కి సూచించారు. అనంతరం అదే గ్రౌండ్ వాలీబాల్ ఆడుకుంటున్న యువకులతో కలిసి కాస్సేపు తాను కూడా ఆడారు. 

ఉదయం ఆరుగంటలకే గ్రౌండ్ కు చేరుకున్న మంత్రి మొదట హరిహారంలో భాగంగా చెట్లు నాటారు. ఈ కార్యక్రమం తరవాత మంత్రి వాకర్స్ ని ఆత్మీయంగా పలకరిస్తూ వారితో కలిసి వాకింగ్ చేశారు. గ్రౌండ్ లో వసతుల గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన గ్రౌండ్ లో వాలీబాల్ ఆడుకుంటున్న యువకులను కలిసారు.. వారితో కలిసి సరదాగా వాలీబాల్ ఆడుకున్నారు.  ప్రొపెషనల్ ఆటగాడి మాదిరిగా కాస్త సీరియస్ గానే వాలీబాల్ ఆడారు మంత్రి కడియం శ్రీహరి.   

వీడియో

"